PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లబ్ధిదారులకు 16 లక్షల 15 వేల రూపాయల చెక్కులు పంపిణి

1 min read

– బనగానపల్లె నియోజకవర్గం లో 17 వ విడత CMRF నిధులు ద్వారా 13 మంది లబ్ధిదారులకు
– 16,35,000 లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాటసాని
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి స్వగృహం నందు 17వ విడత ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా 13 మంది లబ్ధిదారులకు 16 లక్షల 15 వేల రూపాయల చెక్కులను బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి అందజేశారుఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,224 జబ్బులను ఆరోగ్యశ్రీపరిధిలోకిమనముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగిందనిచెప్పారు.గతంలోప్రైవేట్ఆసుపత్రులకు వెళ్లాలంటేనే పేదలగుండెలుపగిలిపోయేటివని కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం పేదవారు వైద్య చికిత్స తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అయితే కొంతమంది ప్రజలు వారు వెళ్లిన ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం లేదని డబ్బులు పెట్టి జబ్బులు నయం చేసుకోవడం జరుగుతుందని అయితే రోగికి వచ్చిన రోగాన్ని బట్టి ఆరోగ్య శ్రీ పథకం ఉన్నటువంటి ఆసుపత్రికి వెళితే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవానికి ఉచితంగా వైద్య చికిత్స అందించడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటివరకు బనగానపల్లె నియోజకవర్గంలో 17 విడుదల లో 872 మంది లబ్ధిదారులకు నాలుగు కోట్ల 90 లక్షల 41,500 వేల రూపాయలు చెక్కులు రూపంలో పేదలకు అందించడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి తూర్పు పడడం జరిగిందని అయితే నేడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి గారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకువచ్చిన ఈ పథకాన్ని సజీవంగా ఉంచాలని లక్ష్యంతో నే వైద్య రంగానికి పెద్దపీట వేయడం జరిగిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో అవుకు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి, ఎర్రగుడి రామసుబ్బారెడ్డి, బండి బ్రహ్మానందరెడ్డి, కంపమళ్ల లోకేష్ రెడ్డి,ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి దేవరకొండ పెద్ద శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author