నష్ట పోయిన పంటకు ప్రభుత్వం ద్వారా పరిహారం అందజేస్తాం
1 min read– ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులకు మంగళవారం నాడు మంచాలకట్ట గ్రామంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వివిధ పంటలను పరిశీలించి పంట బీమా నమోదు చేయించుకున్న ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు ముఖ్యంగా అరటి . మిరప. మొక్కజొన్న. మామిడి .పంటకు నష్టం వాటిల్లిందని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాలేకపోయానని ప్రభుత్వం అందజేస్తున్న వైయస్సార్ పంట బీమా ద్వారా రైతులకు న్యాయం చేకూరుస్తామని అవసరమైతే సీఎంతో మాట్లాడి అందరికీ పంట భీమా అందేలా కృషి చేస్తానని తెలిపారు జగనన్న ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని గతంలో మంచాలకట్ట ఎస్ఆర్బిసి నుండి మద్దిలేరు వాగు వెంబడి ఉన్న రైతులకు నీరు అందేలా కృషి చేశానని శాశ్వత తూము ఏర్పాటుకు సీఎంతో మాట్లాడానని త్వరలోనే అనుమతులు మంజూరు చేసి పనులు మొదలు పెడతామని తెలిపారు ఎమ్మెల్యే వెంట జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి. వైఎస్సార్ సీపీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి. మేఘనాథ్ రెడ్డి. మండల ఉపాధ్యక్షులు కాలు నాయక్. వైసిపి నంద్యాల జిల్లా రైతు అధ్యక్షుడు శిరుప శ్రీనివాసరెడ్డి. శ్రీకాంత్ రెడ్డి. వ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి. తాసిల్దార్ శ్రీనివాసులు. వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.