విచ్చలవిడిగా భూకబ్జాలు …చోద్యం చూస్తున్న అధికారులు
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో భానుముక్కల లో సర్వే నెంబరు 153 ,152 ,151 & ,70 లోని గవర్నమెంట్ భూమిని బంజరు స్థలాలను అధికార పార్టీ నాయకులు కబ్జాలు చేసి ఇళ్ల ప్లాట్లను వేసి సొమ్ము చేసుకుంటున్న పట్టించుకోని అధికారులు. బనగానపల్లె పట్టణంలో ఇంటి స్థలాలు లేనివారు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సర్వే చేసి 500 మందికి ఇళ్ల స్థలాలు లేవని తెలిసి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీతో ఇంటి పట్టాలు ఇవ్వాలని ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఇంటి లేని వారి అప్లికేషన్లు కూడా ఎమ్మార్వో గారికి, పలుదాపాలుగా సమర్పించడం జరిగింది. కానీ బనగానపల్లె ఎమ్మార్వో గారు బంజరు భూములను ఇండ్లు లేని నిరుపేదలకు ఇవ్వటం చేయలేదు అధికార పార్టీ నాయకులు ఇండ్లు లేని వారిని గుర్తించి పట్టాలు మంజూరు చేయమని కూడా అర్జీలు పెట్టడం జరిగింది. ఈ విషయంపై బనగానపల్లె ఎమ్మార్వో గారికి సమాచార చట్టం ద్వారా బంజరు భూములు పైన తెలిపిన సర్వే నెంబర్లలో ఎంత ఖాళీ ఉందని సమారచవరం అడిగినందు 151 52 53 సర్వే నెంబరు లో దాదాపు 3 ఎకరాల పైచిలుకు పంజర భూమి ఉందని ఇవ్వడం జరిగింది ఆ సర్వే నెంబర్లలో బంజరు భూములలో ఇంత ప్లాట్లు వేసిన వ్యక్తులపై కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కాలింగి రాముడు ,, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ ఐ టి సి బాలకృష్ణ ,ముస్లిం మైనార్టీ నాయకుడు ,కాజా, రఫీ సిపిఐ నాయకుడు ఖాదర్ బాషా, ఎంఆర్పిఎస్ నాయకుడు మునయ్య మాల మానాడు నాయకుడు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.