PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దళిత క్రైస్తవులను ఎస్సీల జాబితాలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధం

1 min read

– ఎస్సీ,ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడూరు దస్తగిరి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో దళిత క్రైస్తవులను , ఎస్సీలుగా పరిగణించాలని శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టించడం రాజ్యాంగ వ్యతిరేకమని ఎస్సీ కులాలను వంచించడమేనని ఎస్సీ,ఎస్టీ హక్కుల సంక్షేమవేదిక కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడూరు దస్తగిరి తెలిపారు.ఎస్సీల అబివృద్ది కోసం డాక్టర్ అంబేడ్కర్ కల్పంచిన రిజర్వేషన్లను తప్పుడు మార్గంలో దళిత క్రైస్తవులకు వర్తింపచేయటం ఘోరమైన చర్య అని అన్నారు.గతంలో రాజ్యంగ సభలో రిజర్వేషన్లపై చర్చజరిగినప్పుడు ముగ్గురు క్రైస్తవ సభ్యులు క్రైస్తవంలో కుల వ్యవస్థ అస్రృశ్యత లేవని కనుక మాకు ఎస్సీల రిజర్వేషన్లు అవసరంలేదని చెప్పడం జరిగిందన్నారు.రిజర్వేషన్ల సందర్భంగ మన రాజ్యాంగ సభలో జరిగిన చర్చలో మత పరంగా ఎవరికీ రిజర్వేషన్ల కల్పించరాదని, ఇది దేశ సమైక్యతకు ప్రమాధకరమని శతాబ్దాలుగా సామాజిక వివక్ష, అంటరానితనం అవమానాలకు గురైన హిందు ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని ఏకగ్రీవంగా తీర్మానం అయిందన్నారు.ఎస్సీ కులాలు అంటే హిందు,సిక్కు,బౌద్దులు మాత్రమేనని మిగతా మతాలకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని తెలిపారు.మతం మార్చుకున్న క్రైస్తవులకు,ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించరాదని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందన్నారు.అయితే రాజ్యాంగం చెప్పిన దానిని,ఉన్నత న్యాయ స్థానాల తీర్పలను తుంగలో త్రొక్కి శాసన సభలో ఈ తీర్మానం చేయటం దళిత క్రైస్తవుల ఓటు బ్యాంకు రాజకీయాలకోసమేనని తెలిప్పారు..ఇలాంటి తప్పుడు తీర్మానాలు వెనక్కి తీసుకోకపోతే రాబోయేరోజులో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఉదృతచేస్తామన్నారు.

About Author