PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రవ్వలకొండ క్షేత్రంలో ఘనంగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణం రవ్వలకొండ క్షేత్రంలో వెలసిన శ్రీ వీరప్పయ్య స్వామి ఆనంద్రాశ్రమం,గోశాల దేవస్థానముల వద్ద ఆనందాశ్రమ వ్యవస్థాపకులు ,పీఠాధిపతులు శ్రీ జ్ఞానేశ్వరానంద స్వామి ఆధ్వర్యంలో ఈనెల 25 ప్రారంభమైన శ్రీ వీరప్పయ్య స్వామి, శ్రీ గాయత్రీ దేవి, శ్రీ దక్షిణామూర్తి స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు సోమవారం ఘనంగా ముగిసాయి. కాలజ్ఞాన తత్వవేత్త, శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రచించి పవిత్రస్థలమైన గుహలవద్ద ఆనందాశ్రమ వ్యవస్థాపకులు జ్ఞానేశ్వరానంద స్వామి దాతల సహకారంతో రూ.కోటి వ్యయంతో శ్రీ విరప్పయ్యస్వామి దేవస్తానము నిర్మించి విగ్రహప్రతిష్ఠ కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, అగ్ని ధ్యానము, ధాతున్యాసము, రత్నన్యాసము, స్థాపన, మూహూర్త సమయమునకు, ఉదయం 9-42 ని.లకు విగ్రహ బింబ స్థాపన, కళాణ్యాసము దేనుధర్శనము, మహాపూర్ణాహుతి స్వామి వారి యొక్క దివ్య దర్శనమతో విగ్రప్రతిష్ఠ కార్యక్రమం ముగిసింది.ఈ కార్యక్రమంలో బనగానపల్లె సమరత సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు, న్యాయవాది మాధవరెడ్డి ,శ్రీ శైవ క్షేత్రం పీఠాధిపతి శ్రీ బ్రహ్మచారి శివ స్వామి, శ్రీ బ్రహ్మ పథం పీఠాధిపతి కృష్ణమాచార్యులు, సత్యజ్ఞాన ఋషికుటీరం పీఠాధిపతి ప్రణవానంద భారతిస్వాములు, శ్రీ రుద్ర యోగీశ్వర స్వామి, శ్రీ పాండురంగానంద భారతి స్వామి, రాధా పీఠం మాతాజీ రాధా ప్రియానంద, విశ్వహిందూ పరిషత్ ధర్మప్రచార ప్రముఖులు శ్రీ స్వాత్మానంద స్వామి, శ్రీ బాబా పాండురంగ స్వామి తదితరులు పాల్గొన్నారు.

About Author