PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంట నష్టంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తా – ఎమ్మెల్యే

1 min read

– వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలు –
– అపార నష్టంపై ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్న కౌలు రైతులు -రైతులకు భరోసానిచ్చిన ఎమ్మెల్యే ఆర్థర్

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండలంలో గత రెండు వారాల క్రితం కురిసిన భారీ వడగండ్ల వర్షానికి గాను మండలంలో తీవ్ర పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే.అందుకుగాను మంగళవారం మధ్యాహ్నం నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ మండలంలోని చింతలపల్లి,కాజీపేట,జలకనూరు గ్రామాలలో జరిగిన పంట నష్టం గురించి రైతులతో నేరుగా ఆయన మాట్లాడారు.మేము పెట్టిన ఖర్చు అయినా వస్తుందేమోనని అనుకున్నాం కానీ వర్షం రావడం చేతికొచ్చిన పంట నేల రావడం వలన మా బాధలు వర్ణనా తీతమని అంతేకాకుండా మేము పెట్టిన కూలీల ఖర్చు కూడా రావడం లేదని కౌలు రైతులు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే పాత్రికేయులతో మాట్లాడుతూ మండలంలో ఎక్కువగా పంట నష్టం జరిగిందని మిరప,మొక్కజొన్న,అరటి,బొప్పాయి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తలముడిపిలో ఎక్కువగా పంట నష్టం జరిగిందనిఅన్నారు.మండలంలో 925.5 ఎకరాలు 506 మంది రైతులకు పంట నష్టం జరిగిందని నివేదికలో తేలిందని ఇంకా పంట నష్టం గురించి అధికారులు నివేదిక తయారు చేస్తున్నారని అన్నారు.నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు నష్ట పరిహారం అందే విధంగా చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టపరిహారం అందించాలని కోరుతూ త్వరలో ముఖ్యమంత్రితో మాట్లాడి పంట నష్టం గురించి నివేదికను ముఖ్యమంత్రికి అందజేసి రైతులకు న్యాయం చేసే విధంగా నా శాయశక్తులా కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు.ఈకార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి,నందికొట్కూరు రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి,ఏఓ పీరు నాయక్,రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ షుకూర్,రైతు సంఘం నాయకులు వంగాల సిద్ధారెడ్డి,సుంకేసుల వెంకట్,పీరు సాహెబ్ పేట చంద్రశేఖర్ రెడ్డి,ఇనాయతుల్ల తదితరులు పాల్గొన్నారు.

About Author