48 గంటల్లో నిందితులను అరెస్టు చేసి సొత్తు మొత్తం రికవరీ చేశాం : జిల్లా ఎస్పి
1 min read– కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్ లో 105 కిలోల వెండి చోరీ కేసులో మహిళా హెడ్ కానిస్టేబుల్ అమరావతి, కానిస్టేబుల్ రమణ బాబు అరెస్టు
– చోరీకి సహకరించిన భరత్ సింహా, విజయ భాస్కర్ లను కూడా అరెస్టు చేసిన పోలీసులు
– 10 లక్షల నగదు, 81.52 కేజిల వెండి సీజ్
– హార్డ్ క్రిమినల్ విచారణ చేశాం
– ఈ సంఘటన జరగడం బాధకరం. విచారం వ్యక్తం చేసిన … జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్
– క్రమశిక్షణ ఉల్లంఘన లకు పాల్పడితే ఎంతటి వారి నైనా చర్యలు తీసుకుంటాం
– ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం … జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్ లో రూ. 2,05,000/- నగదు, మరియు 105 కేజి ల వెండి వస్తువులు అపహారణకు గురైన విషయం గురించి జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. అరెస్టు కాబడిన నలుగురు ముద్దాయిల పేర్లు: A1. అయిన L.అమరావతి, వయస్సు 47సంలు, భర్త : B. విజయ భాస్కర్, H.No. 46-156-D-A-1, ,బుధవారపేట, కర్నూలు టౌన్, A2. అయిన D.V.రమణ బాబు వయస్సు 42సంలు, తండ్రి : D. గురువయ్య, H.No.3-12-1, నేతాజీ నగర్, ఆత్మకూరు టౌన్, నంద్యాల జిల్లా A3. అయిన B. విజయ భాస్కర్ , వయస్సు 46సంలు, తండ్రి : B. నాగరాజు H.No.3-12-1, H.No. 46-156-D-A,-1బుధవారపేట, కర్నూలు టౌన్.A4. అయిన B. భరత్ సింహ, వయస్సు 44సంలు, తండ్రి : B. నాగరాజు H.No. 44-19-A, ప్రకాష్ నగర్, కర్నూలు టౌన్.27. 01.2021 తేదీన CI విక్రమ్ సింహా మరియు పోలీస్ స్టాఫ్ తో పాటి పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనికీ చేస్తుండగా తమిళ నాడు రాష్ట్రం , సేలం టౌన్ కి చెందిన సంధన్ భారతి గోవింద రాజ్ వెళ్తున్న అతన్ని వాహనాన్ని ఆపి చెక్ చేయగా , అతని వద్ద ఎలాంటి ఆదారాలు మరియు బిల్స్ లేకుండా రూ. 2,05,000/- మరియు 105 కేజి ల వెండి వస్తువులు దొరకగా, విక్రమ్ సిహ్మ CI గారు , పోలీస్ ప్రొసీడింగ్ ద్వారా సీజ్ చేసి , ఆ సొమ్ముని భద్ర పరుచుటకు అప్పటి పోలీస్ స్టేషన్ రైటర్ రమణ బాబు కి అప్పగించి , దాని మీద చర్య తీసుకొనుటకు కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ వారికి లెటర్ పంపగా, వారు వెండి వస్తువులకు సంబంధించిన బిల్స్ ని వేరిఫై చేసి, రూ. 35,00,000/- ఫైన్ వేసినారు. సొమ్ము ఆదీనంలో ఉంచుకున్న అప్పటి రైటర్ రమణ బాబు , వెండి వస్తువులను , పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్ లో పోలీస్ స్టాఫ్ రెస్ట్ రూమ్ కి ప్రక్కన ఉన్న ప్రాపర్టీ రూమ్ లో భద్రపరిచి , రూ. 2,05,000/- లను పై అధికారులకు తెలియకుండా స్వంత ఖర్చులకి వాడుకుని , కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యాక, సదరు డబ్బు ను, తరువాత రైటర్ గా పని చేసిన అమరావతి కి ఇచ్చి , ఆ తరువాత పోలీస్ స్టేషన్ లో భద్రపరిచిన వెండి వస్తువులను చూపించి , కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ వారు ఎక్కువ ఫైన్ వేయడంతో ఆ సొమ్ము యజమాని గోవింద రాజ్ సొమ్ముని రిలీజ్ చేసుకొనుటకు ఆశక్తి చూపించడం లేదని చెప్పగా, HC అమరావతి సదరు గోవింద రాజ్ కి ఫోన్ చేసి అతనికి నిజంగానే సొమ్ముని రిలీజ్ చేసుకొనుటకు ఇబ్బంది పడుతున్నడని వేరిఫై చేసుకుని , ఎలాగైనా ఆ సొమ్ముని దొంగలించాలని అనుకుని , సదరు విషయం ఆమె భర్త విజయ్ కుమార్ , దొంగతనం చేసిన తరువాత , ఆ సొమ్ముని ఎవరు గుర్తు పట్టుకోకుండా , మార్పు చేయాలి అనుకుని , ఆమె మరిది భరత్ సింహా కు గోల్డ్ షాప్ ఉన్నందున , అతను ఐతే వెండి వస్తువులను కరిగించి వాటి రూపాన్ని మార్పు చేయగలడని అనుకుని, అతనితో మాట్లాడి , అతనికి ఒప్పించి, రమణ బాబు కి చెప్పకుంటే ఎప్పటి కైనా బయట పడుతుoది అనుకుని , అతన్ని కూడా బాగాస్వామ్యం చేస్తే ఎవరికీ తెలిసే అవకాశం లేదు అనుకుని, అతనితో మాట్లాడి ఒప్పించిoది. ఆ తరువాత 24.05.2022 తేదీన కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అయిన ఎక్సైజ్ కేసుల లోని మద్యం బాటిల్లను destroy చేయుటకు మద్యం బాటిల్లను వాహనాల్లో లోడ్ చేసి తరలించే క్రమoలో , అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజి గా ఉండడంతో , సదరు వెండి వస్తువులను దొంగలిoచడానికి అదే అదును అనుకుని , పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వెండి వస్తువులను తీసుకుని , CI గారి రూమ్ లో ఉన్న బీరువా లోకి మార్చి, లాక్ చేసి , సదరు విషయం రమణ బాబు తో మాట్లాడగా , రమణ బాబు కూడా అదే సరైన సమయం అని చెప్పడంతో , CI గారు , SI లు మరియు స్టాఫ్ అందరూ మద్యం బాటిల్ల ద్వంసం చేయుటకు వాహనాలతో పాటి బయటి వెళ్ళగా, అమరావతి , ఇంటికి వెళ్ళిoది. తరువాత రాత్రి 11.30 గంటలకి సివిల్ డ్రెస్ లో స్టేషన్ కి వచ్చి సెంట్రీ తప్ప ఎవరు లేరని గమనించి సెంట్రీ టో ఐదు నిమిషాలు మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోఎంది , ఆ తరువాత తెల్లవారుజామున 02 , 03 గంటల మద్యలో భర్త తో పోలీసు స్టేషన్ కాంపౌండ్ లో CI రూమ్ వెనుకకు వచ్చి ముందే తను తెరిచి పెట్టుకున్న గ్రిల్ల్స్ లేని కిటికీ లో భర్త ని లోనికి పంపించి బీరువా లో ఉన్న రెండు బ్యాగ్ లలో ఉన్న వెండిని దొంగలించి అక్కడి నుండి వెళ్ళిపోయారు.తరువాత కాలక్రమేనా ఆ వెండిని తన మరిది భరత్ సహాయంతో వెండి స్వరూపాన్ని మర్చినారు. దాదాపు 23 కేజీల వెండిని నగదుగా మార్చుకున్నారు. ఆ తరువాత ఈ మధ్య కాలంలో ఆ సొమ్ము యజమాని , కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ వారు వేసిన ఫైన్ కట్టి, రిలీజ్ ఆర్డర్ పొంది , సొమ్ము రిలీజ్ చేసుకొనుటకు తిరుగుతున్నాడని , ఆ సొమ్ము గురించి వెతకగా కనపడలేదని , సొమ్ము మాయం లో వారి పై అనుమానం పడి వారిపై కేసు నమోదు చేసుకున్నారని తెలుసుకుని , అరెస్ట్ చేసి, ఉద్యోగం కూడా తీయిస్తారని అనుకుని, సొమ్ము తో కర్ణాటక కి పారిపోయి , సొమ్ముని అమ్ముకుని, హై కోర్టు లో బెయిల్ తీసుకుందామని నంబరు గల కార్ లో పారి పోతుండగా, మాకు వచ్చిన సమాచారం మేరకు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 10 లక్షల నగదుని, 81.52 కేజి ల వెండి ని సీజ్ చేయడమైనది. ఈ ప్రెస్ మీట్ లో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, డిఎస్పీలు కెవి మహేష్, యుగంధర్ బాబు, సిఐలు రామలింగయ్య, అబ్దుల్ గౌస్, తబ్రేజ్, శ్రీనివాసులు, ఎస్సై మన్మథవిజయ్ ఉన్నారు.