తృటిలో తప్పిన పెను ప్రమాదం..
1 min read– మారని అధికారుల తీరు.. నిర్లక్ష్యానికి నిదర్శనంగా గడివేముల గ్రామం
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఇరుకు రహదారుల్లో భారీ వాహనాలు తిరుగుతుండడంతో గతంలో ఒక విద్యుత్ స్తంభానికి లారీ ఢీకొట్టడం స్తంభానికి పగుళ్లు వచ్చిన విద్యుత్ శాఖ అధికారులు దాన్ని మార్చకపోవడంతో వానరాలు స్తంభాలపై ఎగరడంతో శనివారం సాయంత్రం గడివేముల మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో రెండు విద్యుత్ స్తంభాలు అకస్మాత్తుగా కుప్పకూలడంతో రహదారిపై ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి ప్రాణాపాయం జరగకపోయినా రోడ్డు వెంబడి వాహనాలు దుకాణదారుల సామాగ్రి ధ్వంసం అయింది గతంలో ప్రముఖ పత్రికల్లో స్తంభాలు మార్చండి మహా ప్రభొ అని వార్తలు రాసిన ఆరోజు స్పందించి ఉంటే ఈరోజు ప్రమాదం జరిగేది కాదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు ఇది కచ్చితంగా విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది .. ఒకటేమిటి అన్ని శాఖల అధికారులు ప్రమాదం ముంచుకొచ్చే వరకు స్పందించడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు గతంలో పాత బస్టాండ్ లోనే రహదారి గుంతపడ్డ ఆ గుంతలో పడి ప్రయాణికులు గాయపడ్డ దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు ఆ గుంత పూల్చకపోవడం ఎన్నిసార్లు పంచాయతీ కార్యదర్శికి మొరపెట్టుకున్న వార్త రాసిన కనీసం ఇప్పటివరకు స్పందించడం లేదు భారీ ప్రమాదం ఏదైనా జరిగితే మాత్రం స్పందిస్తాం అన్నట్టు ఉంది అధికారుల తీరు. మొత్తానికి ఇరుకు రహదారులు భారీ ట్రాఫిక్ జామ్ కావడం నిత్యకృత్యం అయిపోయింది ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించి గడివేముల గ్రామానికి బైపాస్ రహదారి మంజూరు చేయిస్తే భారీ వాహనాలు బైపాస్ గూండా ప్రయాణిస్తే ఈ ప్రమాదాలు నివారించే అవకాశం ఉంది.