ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం..
1 min read– విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు..
– కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి పట్ల శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. శనివారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాలను ఆయన పర్యటించి, పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. స్థానిక పంపులు చెరువు సమీపంలోని 44వ సచివాలయాని సందర్శించిన ఆయన అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు. సమీపంలోని 40వ సచివాలయాన్ని సందర్శించేందుకు వెళ్లగా అక్కడ సిబ్బంది ఇంకా సచివాలయాన్ని తీయకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది వచ్చే వరకు అక్కడే వేచి ఉన్న కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ. వారి పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి అవసరమయ్యే పనుల ద్వారా ప్రజలకు సేవలు అందించాలనేదే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అని అన్నారు, రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పని చేయాలని, విధులు పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరించారు. హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాలతి ఆయన వెంట ఉన్నారు.