10వ తరగతి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం
1 min readఅన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: పదవ తరగతి పరీక్షలలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకొంటామని అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు ఐపిఎస్ పేర్కొన్నారు.సోమవారం జిల్లా పరిధిలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించి పలు సూచనలు చేశారు. 10 వ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున పరీక్షా కేంద్రాల వద్ద లేక చుట్టుపక్కల ప్రజలు గుంపులు గుంపులుగా ఉండరాదన్నారు.పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు పరీక్ష సమయం ముగిసేవరకు మూసివయాలని, పరీక్షలు ముగిసేవరకు మైక్రో జిరాక్స్ చేయకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారు ఆదేశాలు జారి చేశారు. పరీక్షా కేంద్రాలకు ఎలాంటి స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్స్, ఐపాడ్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేకుండా పకడ్బంధీగా చర్యలు తీసుకోవాలని పోలీసులను అదేశించారు.మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్, తదితర అక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.