మహిళలందరు సీఎం జగనన్నకు రుణపడి ఉండాలి
1 min read– కౌన్సిలర్ అబ్దుల్ హమీద్.
– నందికొట్కూరు లో ఘనంగా వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పట్టణంలోని జైకిసాన్ పార్కులో వైయస్సార్ ఆసరా మూడవ విడత వారోత్సవాల్లో భాగంగా 8,20,21,28 వ వార్డులలో మున్సిపల్ మేనేజర్ సి. బేబీ అధ్యక్షతన మెప్మా అధికారిణి శాంత కుమారి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు . ముందుగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. అనంతరం 20వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగనన్న ఇచ్చిన మాట ప్రకారం మూడవ విడత ఆసరా సొమ్ము మహిళల ఖాతాల్లో జమ చేశారన్నారు. ప్రతి మహిళ కూడా ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉండాలని పేర్కొన్నారు. వార్డులోని 124 పొదుపు సంఘాలకు రూ. 85.74 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన రుణమాఫీ పొదుపు మహిళల ఖాతాలకు జమ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది పట్టణ సమాఖ్య ప్రెసిడెంట్ ప్రమీల, సి ఓ లు వినయ్ కుమార్, అర్చన, ఓబీ లు, ఆర్.పి లు , సంఘ సభ్యులు పాల్గొన్నారు .