అంబేద్కర్ విగ్రహానికి వేసిన ముసుగు తొలగించాలి
1 min read– డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏప్రిల్ 14న జయంతి సందర్భంగా పునరుద్దించాలి
– డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
పల్లెవెలుగువెబ్ నంద్యాల: నంద్యాల బొమ్మల సత్రం ఫ్లైఓవర్ కింద గల ప్రధాన కూడలిలో గత ఎన్నో సంవత్సరాల క్రితం మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దళిత నాయకులు అయినటువంటి శీలం ఓబులేసు గారి అధ్యక్షతన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.అదే ప్రాంతంలో గత రెండు సంవత్సరాల క్రితం విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించి మధ్యలోనే ఆపివేయడం జరిగింది ఈ విషయం గురించి పాలకపక్షం నాయకులు గాని మున్సిపల్ కమిషనర్ గారు గాని కలెక్టర్ గారు గాని ఎటువంటి చర్యలు తీసుకోపోగా ఆ విగ్రహ పనులను మరిచిపోయిన విధంగా ప్రవర్తించడం సరియైన తీరు కాదు అని మధ్యలో ఆపివేసిన పనులను పూర్తిస్థాయిలో కంప్లీట్ చేసి అక్కడ ఉన్న ఇంకొక విగ్రహాన్ని నంద్యాల పట్టణంలోని ఎస్బిఐ కాలనీ కి వెళ్లే చౌరస్తా , టేక్కే చౌరస్తా ప్రధాన కూడలిలో నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.ఈ విషయం మీద వెంటనే స్పందించి స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు స్థానిక ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారు త్వరితగతిగా చర్యలు తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏప్రిల్ 14వ తారీకు జయంతి సందర్భంగా పునరుద్దించాలని మనవి, నంద్యాల పట్టణంలో చాలామంది నాయకుల విగ్రహాలు నాలుగు ఐదు ఉండంగా అంబేద్కర్ విగ్రహాలు ఇంకొకటి ఏర్పాటు చేయడంలో వచ్చిన ఇబ్బంది ఏంటి అని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు, ఏపీ సి సి రాష్ట్ర అధికార ప్రతినిధి ఊకోటు వాసు, నంద్యాల పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య, మైనార్టీ నాయకులు చాబోలి సలాం, బ్రహ్మారెడ్డి, సత్య రాజ్, రత్నమయ్య ,శేఖర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.