PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సర్పంచు ప్రకాశం ను సన్మానించిన ఉపాధ్యాయులు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: డా. బీఆర్. అంబేద్కర్ 132వ జయంతి పురష్కరించు కొని పారుమంచాల గ్రామ సర్పంచ్ మాదవరం ప్రకాశం ను పారుమంచాల జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మన్న పాఠశాల ఉపాధ్యాయులు,డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గాదె. రోశన్న ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సర్పంచు మాట్లాడుతూ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగ ఫలితంగా ఈ రోజు నేను గ్రామ సర్పంచి పదవి అనుభవస్తున్నాన్నని ప్రకాశం తెలియజేశారు. బడుగు బలహీన వర్గాల, ఎస్సి ఎస్టీ ల అభ్యున్నతికి, స్త్రీల పక్కుల కొరక, స్త్రీల సంక్షేమం దృషి చేసిన మహాను భావుడు అని కొనియాడరు. ప్రధానోపాధ్యాయు లు లక్ష్మన్న వివరించారు. రాజ్యాంగ పుస్తకాలు ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ఇవ్వాలన్నారు. రాష్ట్ర నాయకులు శ్రీ గాదె. రోశన్న మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యంగంలో రిజర్వేషన్లు రాసిన ఫలితంగానే ఈ రోజు దళితులు సర్పంచు ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే లుగా పదవులు పొందారన్నారు. అంటరాని తనం నిర్మూలించడం కోసం ఆర్టికల్ 17 ను రాజ్యాంగంలో పొందు పర్చడం జరిగిందన్నారు. భారతదేశంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా నడుస్తున్నా యంటే ప్రపంచ మేదావి అంబేద్కర్ పుణ్యమే అన్నారు. మనుధర్మ శాస్త్రం తగుల బెట్టి అనేక పోరాటాలు చేసి హక్కులు సాధించిన గొప్ప విప్లవ నేత, న్యాయకోవిధుడు, ఆర్థిక వేత్త, తత్వవేత్త, వేగుచుక్క, అణగారిని కులాల ఆశాజ్యోతి అంబేద్కర్ అన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author