మొక్క జొన్నతో కానరాని తారు రోడ్డు
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో అవుకు మండలం, రామవరం నుండి మెట్టు పల్లి గ్రామ పరిధిలో మొక్క జొన్న రైతులు , వరి రైతులు నడి రోడ్డు మీద కుప్ప లు కుప్పలు గా పోసి రోడ్డు వెంట ఆరాపొస్తు ఉండడం వాహనాల కు దారి లేకుండా ఉండడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి 3నెలల క్రితం పాల బ్రహం ఆటో రాత్రి పూట వస్తున్నా సమయం లో ఆటో కింద పడి ప్రమాదానికి గురి అయ్యి గాయాలు మనిపోక అతను ఇప్పటికి హాస్పిటల్ కు మందుల కొరకు తిరుగుతున్నారు, రామవరం నుండి రైతు కూలీలు మేరప పంట కోయుటకు సింగనపల్లి, ఆకుమల్ల సంగపట్నం, తెల్లవారుజామున 5 గంటల సమయంలో పనులకు పోవటంతో ఆటోలలో కూలీలు చీకటిలో ప్రయాణం చేయటం వలన ఎక్కడ ప్రమాదాలు కు గురి అవుతామో అనీ భయందోళన కు గురి అవుతున్నాం అని చెప్తున్నారు, మరియు రామవరం నుండి పాల వ్యాపారస్తులు అవుకు పట్టణానికి తెల్లవారుజామున వెళ్ళాలి కావున వారు ఎక్కడ ప్రమాదానికి గురి అవుతామో అని భయపడుతున్నారు కావున రెవిన్యూ అధికారులు, R&B అధికారులు, పోలీస్ అధికారులు ఈ సమస్య ను పరిష్కరించాలని రామవరం గ్రామ ప్రజలు విన్నవిస్తున్నారు.