PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాయలసీమ కర్తవ్య దీక్షను విజయవంతం చేద్దాం

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలపై అలుపెరగని పోరాటాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో, రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాయలసీమ కర్తవ్యదీక్ష విజయవంతం చేద్దామని సీనియర్ రాజకీయ నాయకులు పాలూరు రామగోపాల్ రెడ్డి, రాయలసీమ స్టీరింగ్ కమిటీ నంద్యాల జిల్లా నాయకులు యం. వి. రమణారెడ్డిలు కోరారు.బుధవారం నంద్యాల మండలం పుసులూరు గ్రామంలో రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రైతుల సమావేశం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాయలసీమను కరువు కోరల్లోకి నెట్టే అక్రమ ఎగువ భద్ర ప్రాజెక్టును ఆపాలని, రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాలు సమానంగా కేటాయించాలని, ఇప్పటికే కేంద్రం మంజూరు చేసిన 167 K జాతీయ రహదారి నిర్మాణం లో భాగంగా సంగమేశ్వరం వద్ద కృష్ణానదిపై తీగల వంతెన మంజూరు అయిందని, ఈ తీగల వంతెన వల్ల రాయలసీమ కరువు, వలసలు ఆగవని, తీగల వంతెన బదులు బ్యారేజ్ కం బ్రిడ్జి నిర్మాణం చేస్తే సంగమేశ్వరం వద్ద సుమారు 70 TMC ల నీరు నిలిచి రాయలసీమ ప్రాజెక్టులకు అంది కరువు, వలసలకు పరిష్కారం లభిస్తుందన్నారు.రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ఈ నెల 24-04-2023 రాయలసీమ కర్తవ్య దీక్ష కర్నూలు STBC కళాశాల మైదానంలో జరిగిందని ఈ దీక్షకు పుసులూరు గ్రామం నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేద్దామన్నారు.ఈ సమావేశంలో పుసులూరు రైతులు పి. రామకృష్ణారెడ్డి, జి. జయన్న, పి. చిన్న సంజీవరాయుడు యం. రామచంధ్రుడు, బి. వెంకటేశ్వర్లు, ఫరూక్ బాషా, లక్ష్మి నారాయణ, పెద్దరాజు, సీతారామిరెడ్డి, సుమంత్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About Author