కురువలను అవమానపరిచిన లోకేష్… కురువ సంఘం ఆగ్రహం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: యువగలం పాదయాత్రలో లోకేష్ పత్తికొండ నియోజకవరం లో, ఆలూరు నియోజకవర్గంలో కురువ లు అధికంగా ఉండడంతో వారితో సమావేశం ఏర్పాటుకు సన్నcద్ధం చేయగా, ఆయా ఇన్చార్జిలు ససేమిరా అనడంతో ,పత్తికొండ లో లోకేష్ తో కురువల ముఖాముఖీ ఏర్పాటు చేయలేదు ,అలాగే ఆలూర్ నియోజకవర్గం లో నిన్న సాయంకాలం 5 గంటలకు అలార్దిన్నె క్రాస్ వద్ద కురువల తో సమావేశం ఉందని చెప్పిన నాయకగణం మల్లి రద్దుచేయడం లో అంతరార్ధం ఏమిటో అర్థం కాలేదు. కుల రాజకీయాలు చేయడం టిడిపికే చెల్లుతుంది అనే అనుమానం వస్తుంది, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో టిడిపికి మా కురువల ఓట్లు చాల కీలకం, అలాంటిది ఎందుకు ఇంత వివక్ష మా కులంపై చూపుతున్నారో లోకేష్ ఒక్క సారి నీకు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇది నిజంగా కురువలను అవమానపరచడమే అని కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కే .కిష్టన్న, ,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి,జిల్లా కోశాధికారి కే .సి .నాగన్న ,నగర అధ్యక్ష కార్యదర్శి తవుడు శ్రీనివాసులు బి .రామకృష్ణ లు , ఆగ్రహం వ్యక్తం చేసారు .కురువలు లోకేష్ తో తమ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం లేకుండా ఆలూరు, పత్తికొండ ఇన్చార్జిలు విశ్వప్రయత్నాలు చేశారు. పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలతో పాటు కర్నూలు జిల్లాలో పత్తికొండ ,ఆలూర్ ,ఆదోని ,మంత్రాలయం ,యెమ్మిగనూరు ,లలో నంద్యాల జిల్లా పాణ్యం, నందికొట్కూరు లలో అత్యధిక ఓట్లు కలిగిన కురువలు లేకుండా ఒక్క నియోజకవర్గమైన గెలవడం తెలుగుదేశం పార్టీ కి చేతనౌతుందా అని జిల్లా కురువ సంఘం నాయకులు దుయ్యబట్టారు ..దీన్నిబట్టి పత్తికొండ ఆలూరు నియోజకవర్గం లో ఉండే కురువ కులస్తులు గమనించి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వారు కోరారు.