అతివేగం..ప్రమాదకరం: డీఎస్పీ
1 min readపల్లెవెలుగు: కర్నూలు నగర ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు ట్రాఫిక్ డీఎస్పీ నాగభూషణం. శుక్రవారం డీఎస్పీ ఛాంబరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలోని కొత్త బస్టాండ్, కలెక్టరేట్, సీ క్యాంప్, రాజ్ విహార్, మౌర్య ఇన్ సర్కిల్, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ తదితర కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టామని, ఇందుకు నగర ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. బైక్పై ప్రయాణించే వారు లైసెన్స్ తమ వద్ద పెట్టుకోవాలన్నారు. అదేవిధంగా హెల్మెట్ ధరించాలని, అతివేగంగా బైక్ నడపరాదని సూచించారు. అతివేగం ప్రమాదకరమని, అదేవిధంగా ఆటో డ్రైవర్లు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. ఎండలు మండిపోతున్న తరుణంలో.. అవసరమైతే తప్పా రోడ్లపై రావద్దని, ఆరోగ్య సూత్రాలు పాటించాలని ఈ సందర్భంగా ట్రాఫిక్ డీఎస్పీ నాగభూషణం హితువు పలికారు.