PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధిక ఫీజులపై.. ఆరా

1 min read

– మెడికవర్​, అమీలియో ప్రైవేట్​ కార్పొరేట్​ ఆస్పత్రులున తనిఖీ చేసిన జేసీ( అభివృద్ధి) డా. మనజీర్​ జిలానీ సామూన్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: : కోవిడ్ నేపథ్యంలో కోవిడ్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరల కన్నా అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ నిర్వాహకులను హెచ్చరించారు . గురువారం మధ్యాహ్నం కర్నూల్ నగరంలోని మెడికవర్, అమీలియా ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రులను జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.

హాస్పిటల్లో మొత్తం ఆక్సిజన్, నాన్ ఆక్సిజన్ ఐసియు పడకలు ఎన్ని… నిండిన ఆక్సిజన్ పడకలు ఎన్ని…అందుబాటులో ఉన్న పడకలు ఎన్ని… ఆరోగ్యశ్రీ పథకం కింద ఎంతమంది అడ్మిట్ అయ్యారు…ఎంతమంది ట్రీట్మెంట్ పొందుతున్నారు… తదితర వివరాలను ఆరోగ్యమిత్రలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి తాజా సమాచారాన్ని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కు తెలియజేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ సుమన్, ప్రైవేట్ హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ లు, హాస్పిటల్ మేనేజ్మెంట్ నిర్వాహకులు, ఆరోగ్య మిత్రలు, డాక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.


About Author