PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘కాంట్రాక్ట్’ ఉద్యోగులపై నిర్లక్ష్యం…!

1 min read

ఉద్యోగ భద్రత లేదు… జీతాల పెంపు లేదు..

ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్​ చేస్తూ.. ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ధర్నా

పల్లెవెలుగు వెబ్​:ఉద్యోగులు..కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తోందన్నారు ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్​ గిరికుమార్​ రెడ్డి. నగరంలోని ధర్నా చౌక్​లో మంగళవారం కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ… ఉద్యోగ సంఘాలతో కలిసి ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాకు సీఐటీయూ జిల్లా , పట్టణ నాయకులు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా గిరికుమార్​ రెడ్డితోపాటు ఏపీజేఏసీ ప్రధాన కార్యదర్శి కె.వై. కృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతామని, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి 4 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వం ఇచ్చిన మాటనిలబెట్టు కోవాలని,  ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరి విడనాడాలని,  ఉద్యోగులకు/ విశ్రాంత ఉద్యోగుల కు రావలసిన బకాయిలకు సత్వరమే విడుదల చేయాలని,12 వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటుచేయాలని,రావలసిన డి.ఏ లను విడుదల చేయాలని,ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగు లు ఏపీజేఏసీ అమరావతి నేతలు నాగరమణయ్య, రవీంద్రారెడ్డి, రామా నాయుడు, సులోచనమ్మ, శోభా సువర్ణమ్మ, లోకేశ్వరి, సూరిబాబు, ప్రతాప్ ఇతర శాఖల కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మరియు  పంచాయతీరాజ్ ఇంజనీర్లు,సమగ్ర శిక్ష అభియాన్  ఉద్యోగులు , కె.జి. బి.వి. టీచర్స్ , APPTD ఉద్యోగులు  మరియు  కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author