జగనన్నే మా భవిష్యత్ తో ప్రతిపక్షాలు ఉలికిపడుతున్నాయి
1 min read– మళ్ళీ జగనన్న పాలనే కావాలని ప్రజలు ఆశిస్తున్నారు.
– జగనన్నతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం.
। ఎమ్మెల్యే తొగురు ఆర్థర్..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: వైసీపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నే మా భవిష్యత్ జగనన్నే మా నమ్మకం కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న అపూర్వమైన స్పందనను చూసి ప్రతిపక్షాలు ఉలికిపడుతున్నాయని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. నందికొట్కూరులోని ఎమ్మెల్యే కార్యాలయం నందు జగనన్నే మా భవిష్యత్తు జగనన్నే మా నమ్మకం కార్యక్రమం గురించి మంగళవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ మాట్లాడుతూ ఏప్రిల్ 7 నుంచి చేపట్టిన జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో వైసీపీ కి చెందిన గృహ సారధులు, పార్టీ కౌన్వీనర్లు , వైసీపీ నాయకులు కార్యకర్తలు దాదాపు 7 లక్షల మంది సైనికులు పాల్గొని విజయవంతం చేశారన్నారు.15 రోజులలోనే కోటి కుటుంబాలను నేరుగా కలుసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి సర్వే నిర్వహించామన్నారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. సర్వేలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని ఆయన వెల్లడించారు. మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆశిస్తున్నారన్నారు.జగనన్న తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు కోరుకుంటున్నారు అని తెలిపారు.జగనన్న కాలనీ ద్వారా పేదలకు సొంతింటి కల నెరవేరిందన్నారు.ఈ నెల 29 వరకు జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం కొనసాగుతోందని తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ గంగిరెడ్డి రమాదేవి , రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ హాజీ అబ్దుల్ సుకూర్ , నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ సగినేల. ఉసేనయ్య, బ్రాహ్మణ కొట్కూరు సింగిల్ విండో చైర్మన్ మద్దూరు హరి సర్వోత్తమ్ రెడ్డి , నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బాని , కౌన్సిలర్ మొల్ల జాకీర్ హుస్సేన్ , నందికొట్కూరు పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ , మాజీ కౌన్సిలర్ దేశెట్టి శ్రీనివాసులు , వైసీపీ నాయకులు తమ్మడపల్లె విక్టర్, విశ్రాంత పోలీసు అధికారి పెరుమాళ్ళ జాన్ , ముజీబ్, మహేష్ ,వెంకటేష్, బూసి గౌడు, చిట్టి రెడ్డి,ఉదయ్, సుజిత్ రెడ్డి, అశోక్ రెడ్డి, వెంకటస్వామి, వలి భాష, పాములపాడు మండల కన్వీనర్ శ్రీముడియాల వెంకటరమణారెడ్డి , ఎర్రగూడూరు మురహరి రాజన్న, స్వామిదాసు, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.