PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడు జగనన్న వసతి దీవెన నిధులు విడుదల..

1 min read

– జిల్లాలో 29,180 మంది తల్లుల ఖాతాల్లో రూ. 30.96 కోట్లు జమ
– అనంతపురంలో జరిగే కార్యక్రమంలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లాలో డిగ్రీ నుంచి పిజి వరకు ,ఇంజనీరింగ్, మెడికల్ ఇతర కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బి.సి., ఇబిసి, మైనారిటీ విద్యార్ధులకు 2022-23 విద్యా సంవత్సరానికి మొదటి విడత జగనన్న వసతి దీవెన నిధులు సంబందించి 32,316 మంది విద్యార్థులకు చెందిన 29,180 మంది తల్లుల బ్యాంక్ ఖాతాలకు రూ. 30.96 కోట్లు నిధులు విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. రాష్ట్రంలో డిగ్రీ నుంచి పిజి వరకు చదువుతున్న ఇంజనీరింగ్, మెడికల్ ఇతర కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బి.సి., ఇబిసి, మైనారిటీ విద్యార్ధులకు 2022-23 విద్యా సంవత్సరానికి మొదటి విడత జగనన్న వసతి దీవెన నిధులు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 26న అనంతపురం జిల్లాలో విడుదల చేయనున్నారు. ఏలూరు జిల్లాలో 32,316 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఏలూరు జిల్లాలో 7,677 ఎస్సీ విద్యార్థులకు ,1,016 మంది ఎస్.టి విద్యార్థులకు, 14,939 మంది బి.సి విద్యార్థులకు, 3,004 మంది ఇ.బి.సి విద్యార్థులకు, 864 మంది ముస్లిం మైనారిటీ విద్యార్థులకు, 4,427 మంది కాపు విద్యార్థులకు , 389 మంది క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులకు లబ్దిచేకూరుతుంది. నియోజకవర్గవారీగా : ఏలూరు నియోజకవర్గంలో 2,840 మంది విద్యార్థులకు రూ.2.76 కోట్లు,చింతలపూడి నియోజక వర్గంలో 5,087 మంది విద్యార్థులకు రూ.4.93కోట్లు,దెందులూరు నియోజక వర్గంలో 5,607 మంది విద్యార్థులకు రూ.5.38కోట్లు, కైకలూరు నియోజక వర్గంలో 4,162 మంది విద్యార్థులకు రూ.3.94 కోట్లు,నూజివీడు నియోజక వర్గంలో 5,572 మంది విద్యార్థులకు రూ.5.27 కోట్లు పోలవరం నియోజక వర్గంలో 3,874 మంది విద్యార్థులకు రూ.3.74 కోట్లు, ఉంగుటూరు నియోజక వర్గంలో 4,083 మంది విద్యార్థులకు రూ.3.88 కోట్లు,గోపాలపురం నియోజక వర్గంలోనీ ద్వారక తిరుమల మండలం లో 1,091 మంది విద్యార్థులకు రూ.1.05 కోట్లు జమకానున్నాయని తెలిపారు.

About Author