ప్రజలు వద్దంటున్నా బలవంతంగా జగన్ స్టిక్కర్లు
1 min read– సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ బెదిరింపులు
– వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయారు
– ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీదే విజయం
– నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జగన్ స్టిక్కర్లు వద్దని వ్యతిరేకించినా బలవంతంగా వైసీపీ నేతలు అతికిస్తున్నారు .అభ్యంతరం చెప్పిన ప్రజల సంక్షేమ పథకాలు అపేస్తామని వైసీపీ నేతలు బెదిరింపులకు దిగజారుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ సైకోపాలనపై విసుగు చెందిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ ని అధికారంలోకి తీసుకురావాలని ఎదురుచూస్తున్నారని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు .బుధవారం నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి నివాసంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ల కు, క్లస్టర్ ఇంచార్జి లకు ,బూత్ కన్వీనర్లకు ఇంటిగ్రేటేడ్ నియోజకవర్గ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో పెరిగిన ధరల గురించి వివరించారు. గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే అది ఒక్క చంద్రబాబుకే సాధ్యమన్నారు.రాష్ట్రంలో టీడీపీ పవనాలు వీస్తున్నాయని అన్నారు. వైసీపీ పాలనపై విసుగు చెందిన ప్రజలు చంద్రబాబు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడం ఖాయమన్నారు. నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశనంటడంతో పేదలు పస్తులతో కాలం వెల్లదీస్తున్నారన్నారు. ఇటువంటి దుర్మార్గ పాలనను ఎన్నడూ చూడలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారన్నారు. సంక్షేమం ముసుగులో రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర ప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే ఇంటింటికి స్టిక్కర్లు అతికించాల్సిన పనే లేదు.మీ పాలన పనితీరు బాగాలేదని ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎద్దేవా చేశారు. మీ పాలన గురించి మీ పార్టీ ఎమ్మెల్యే లు ,ఎంపీ లు కూడా బాహాటంగా విమర్శలు చేస్తున్నారన్నారు. నాలుగు సంవత్సరాల మీ పాలనలో ప్రజలు నరకం చూశారు. మీ పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రహదారులు లేవు..విద్యుత్ వీధి దీపాలు లేవు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సరిపడా మందులు లేవని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.మీ పాలనలో ఇసుక మాఫియా.. లిక్కర్ దందాలతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. టీడీపీ హయంలోనే సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి. పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కర్నూలు ఉమ్మడి జిల్లాలో లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారన్నారు.సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండం రమణా రెడ్డి, వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్, నందికొట్కూరు ,శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకులు దేవల్ల మురళీ, నందికొట్కూరు అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకటస్వామి, ఆర్టీఎస్ జిల్లా కన్వీనర్ ముస్తఫా , మండల కన్వీనర్లు కాతా రమేష్ రెడ్డి, పల్లె రఘు రామిరెడ్డి, గిరీశ్వర్ రెడ్డి, బిసి సంఘం రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు యాదవ్ , ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జయసూర్య ,టీడీపీ పట్టణ అధ్యక్షుడు మున్సిపల్ కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి , ఐటీడీపి నియోజకవర్గ అధ్యక్షుడు మూర్తుజావలి, మైనార్టీ అధికార ప్రతినిధి షకీల్ అహమ్మద్ ,తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు మద్దిలేటి,ఎస్సి సెల్ పట్టణ ప్రధాన కార్యదర్శి బొల్లెద్దుల రాజన్న, టిడిపి లీగల్ సెల్ నాయకులు జాకీర్, టీడీపీ నాయకులు శాలు, కళాకర్, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.