లక్ష్మీపురం జగన్నాథగట్టు.. పదేళ్లకు లీజు
1 min read– పోటాపోటీగా పాల్గొన్న కాంట్రాక్టర్లు
– రూ.7లక్షలకు దక్కించుకున్న కర్నూలు వాసి
– ప్రభుత్వానికి చేకూరిన భారీ ఆదాయం..
– జిల్లా పర్యటక శాఖ ఉన్నతాధికారి పి.విజయ
పల్లెవెలుగు, కర్నూలు:నగరంలోని లక్ష్మీపురం జగన్నాథగట్టు ఆలయం, పరిసర ప్రాంతాలను పర్యాటక స్థలంగా గుర్తిస్తూ… ఆలయ అభివృద్ధి దిశగా రాష్ర్ట ప్రభుత్వం అడుగులు వేసింది. అందులో భాగంగా జగన్నాథగట్టుకు వేలం పాట నిర్వహించింది. గురువారం జిల్లా పర్యాటక శాఖ ఉన్నతాధికారి పి. విజయ నేతృత్వంలో వేలం పాట జరిగింది. జగన్నాథగట్టు …పదేళ్ల లీజు కోసం గుత్తేదారులు పోటీ పడ్డారు. దాదాపు 5 గంటలపాటు జరిగిన వేలం పాటలో ప్రభుత్వానికి భారీ ఆదాయం చేకూరింది. వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీపురం జగన్నాథగట్టుపైనున్న ఆలయం చుట్టు పరిసర ప్రాంతాలు, చిల్ర్డన్ పార్క్,మూడు గదులు, ఫుడ్ కోర్టులతోపాటు వాచ్మెన్ ఏర్పాటు కోసం పది సంవత్సరాలకుగాను లీజుకు వేలం పాట నిర్వహించారు. ఆలయం ఆవరణంలో టెంకాయలు, పూలు(పూజాసామగ్రి) మోటారు బైక్, కార్లు స్టాండింగ్, తినుబండారాలు( షాపుల) ఏర్పాటుకు, గదుల లీజు, చిల్ర్డన్ పార్క్ తదితర నిర్వహణ కోసం వేలం వేశారు. పాటలో 15 మంది లీజుదారులు పాల్గొనగా కర్నూలుకు చెందిన మధుసూదన్ రూ.7లక్షలకు వేలం దక్కించుకున్నాడు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పదిశాతం పెంపుతో లీజు చెల్లించాల్సి ఉంటుందని కర్నూలు పర్యాటక శాఖ ఉన్నతాధికారి పి. విజయ వెల్లడించారు.
కర్నూలు పర్యాటక రంగంలో…ఇదో మైలురాయి..:
కర్నూలు పర్యాటక శాఖ రంగంలోనే ఇది మైలురాయి వంటిది. ఇప్పటి వరకు జగన్నాథగట్టు ఆలయ పరిసర ప్రాంతాన్ని … పర్యాటక రంగం గుర్తించలేదు. గతంలో కొన్నేళ్లపాటుఓ అ ధికారి .. ఆలయ పరిసర ప్రాంతాన్ని లీజుకు ఇస్తూ… లక్షల ఆదాయం దిగమింగాడు. జగన్నాథగట్టు ఆలయంకు వచ్చే భక్తుల నుంచి టెంకాయలు, బైక్ స్టాండింగ్, గదుల ద్వారా వచ్చే నిధులు స్వాహా చేస్తూ.. లక్షలు గడించాడు. పర్యాటక శాఖ జిల్లా ఉన్నతాధికారిగా పి. విజయ బాధ్యతలు తీసుకున్న మొదటిసారి జగన్నాథగట్టు ఆలయం అభివృద్ధి వైపు దృష్టిసారించింది. ఈ క్రమంలో ఆలయం ఆవరణ స్థలం లీజుకు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.7లక్షల ఆదాయం చేకూరుతుంది .