మే డే సాక్షిగా .. హక్కుల అజెండాను పాలకుల ముందు ఉంచుదాం
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: 137వ మే డే సందర్భంగా గోనెగండ్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఉన్న సిఐటియు జెండాను సిఐటియు జిల్లా కార్యదర్శి రమిజాబి ఎగరవేశారు.అలాగే హెచ్ కైరవాడి లో సిఐటియు సీనియర్ నాయకులు బతకన్న జెండాను ఎగరవేశారు.జండా ఆవిష్కరణల సందర్భంగా బతకన్న, సురేష్ ల అధ్యక్షతన జరిగిన సభలను ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం డి ఆనందబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి రమిజాబీ, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షులు దండు కాజా, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బి కరుణాకర్, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణ లు మాట్లాడుతూ మేడే ఎగిరిన ఎర్రజెండా సాక్షిగా ప్రతిన భూని సకల జనుల హక్కుల అజెండాను పాలకుల ముందు ఉంచుదామని, పరిష్కరిస్తారా లేదా పోరే ఆయుధంగా ఉద్యమించమంటారా అంటూ పిడికిలెత్తి తిరగబడాలని వారు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 137 సంవత్సరాల క్రితమే ప్రాణాలొడ్డి సాధించబడ్డ కార్మిక హక్కులు, నేడు అధికారంలో ఉన్న పాలకుల కారణంగా మరో మారు పాతాళంలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారని, అన్ని రకాల కార్మికులంతా ఐక్యమై హక్కుల కోసం తిరుగుబాటే ఆయుధంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. ఈ జండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆశ, స్వచ్ఛ భారత్, ఆటో, డప్పు కళాకారుల సంఘం, విఓఏ సంఘాల నాయకులు పాల్గొన్నారు.