PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: భార్యపై అనుమానంతో కత్తితో పొడిచి చంపిన భర్తను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆత్మకూరు డిఎస్పీ ఏ. శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వివరాలు సోమవారం వెల్లడించారు.పగిడ్యాల మండలంలోని ఎం. ఘణ పురం గ్రామానికి చెందిన బోయ లక్ష్మీ దేవి( 38)కి స్థానిక మండలంలోని పాత ముచ్చుమర్రి గ్రామానికి చెందిన బోయ ఉసేనయ్య తో గత 20 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వారికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. గత ఏడాది క్రితం బావమరిది బోయ వెంకటరమణ వద్ద రూ. లక్ష అప్పుగా తీసుకున్నాడు. అప్పు అడిగితే దాటవేస్తూ భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానంతో భార్య భర్తలు గతకొద్ది కాలంగా గొడవలుపడుతున్నారు. ఈ నెల 5 వ తేదీన ముచ్చుమర్రి గ్రామంలో జరిగిన శ్రీ జమ్ముల పరమేశ్వరి విగ్రహం ప్రతిష్ట సందర్భంగా ఇంటికి బంధువులు వచ్చారు.ఈ నేపథ్యంలో భార్య భర్తలు గొడవపడి లక్ష్మీ దేవి పుట్టింటికి ఘణపురం వచ్చింది. ఇది జీర్ణించుకోలేక పోయిన ముద్దాయి ఉసేనయ్య గణపురం గ్రామానికి వెళ్లి భార్యను కత్తితో దాడి చేశాడు. ఆమె అక్కడికక్కడే రక్తపుమడుగులో మృతిచెందింది. మృతురాలు తమ్ముడు బోయ వెంకటరమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నందికొట్కూరు రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముచ్చుమర్రి ఎస్సై నాగార్జున తన సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. సోమవారం నిండుతుడు బోయ ఉసేనయ్య పాత ముచ్చుమర్రి గ్రామ శివారులో ధోభీ ఘాటు వద్ద ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిందితున్ని కోర్టులో హాజరు పరిచారు. కేసును త్వరగా ఛేదించిన పోలీసు సిబ్బందిని డిఎస్పీ అభినందించారు. సమావేశంలో రూరల్ సిఐ సుధాకర్ రెడ్డి, పట్టణ సీఐ విజయ భాస్కర్, ముచ్చుమర్రి ఎస్సై నాగార్జున, హెడ్ కానిస్టేబుల్ షేక్షావాలి, కానిస్టేబుల్ ఈశ్వర్, నాగన్న , తదితరులు పాల్గొన్నారు.

About Author