‘కెనడా శానిటైజ్ రీసెర్చి ’లో “నాసల్ స్ప్రే” తయారీ..!
1 min readవాషింగ్టన్ : కొవిడ్ బాధితుల్లో వైరల్ లోడును 99 శాతం వరకు నిర్మూలించే నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే ను కెనడా లోని శానిటైజ్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థ తయారు చేసింది. ఈ ఔషధం ఎగువ శ్వాస నాళాల్లోని వైరస్‌ను నిర్మూలిస్తుందని ఆ సంస్థ తెలియచేసింది. అలా చేయకుంటే వైరస్ మొదట ఎగువ శ్వాస నాళాల్లో వైరస్ తిష్ట వేసి తరువాత ఊపిరి తిత్తుల్లోకి విస్తరిస్తుంది. ఈ పరిస్థితిని ఈ నాసల్ స్ప్రే నివారిస్తుంది. కొవిడ్ బాధితులైన 79 మందిపై ఈ స్ప్రేను పరీక్షించగా సత్ఫలితాలు కనిపించాయి. ఈ స్ప్రేను వాడిన 24 గంటల్లోనే 95 శాతం మేర వైరస్‌ను ఇది నిర్మూలించిందని సంస్థ పరిశీలకులు చెప్పారు.బ్రిటన్‌లో మొదట బయటపడిన కరోనా వైరస్ రకంపై కూడా ఇది సమర్ధంగా పనిచేస్తుందని వివరించారు. ఈ స్ప్రే వినియోగానికి ఇజ్రాయెల్, న్యూజిలాండ్ ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. భారత్ లోనూ దీన్ని ఉత్పత్తి చేయడానికి శానోటైజ్ సంస్థ సంప్రదింపులు సాగిస్తోంది.