యువనేతను కలిసిన యాదవ సామాజికవర్గీయులు
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గం జూపాడులో యాదవ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను గురువారం యువగళం పాదయాత్రలో కలిసి సమస్యలను విన్నవించారు. జిఓ 559/106 ప్రకారం గొర్రెలు, ఆవుల సొసైటీలకు 5ఎకరాల భూమిని కేటాయించాలి.50సంవత్సరాలు దాటిని గొర్రెలు, ఆవుల కాపరులకు రూ.3వేల పెన్షన్ ఇవ్వాలి.పాలడెయిరీ చైర్మన్ పదవులు యాదవులకు కేటాయించాలి.యాదవ కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలి.మా గ్రామంలో శ్మశానం లేకపోవడంతో కెసి కెనాల్ లో దహనం చేస్తున్నాం. శ్మశానానికి స్థలం కేటాయించాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో డెలివరీల పేరుతో భారీగా డబ్బు వసూలు చేస్తున్నారు. మా గ్రామంలో హాస్పటల్ నిర్మించాలి.గ్రామంలో శ్రీకృష్ణుడి గుడి, కళ్యాణ మండపం కోసం 15సెంట్ల స్థలం కేటాయించాలి.
లోకేష్ మాట్లాడుతూ..
• తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బిసిలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది.
• గతంలో గొర్రెలు, గోవుల సొసైటీకు కేటాయించిన భూములను వైసిపి నేతలు కబ్జాచేశారు.
• యాదవులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన పార్టీ టిడిపి. గత ప్రభుత్వంలో కీలకమైన ఆర్థికమంత్రి, టిటిడి బోర్డు చైర్మన్ వంటి పదవులను యాదవులకు కేటాయించాం.
• గొర్రెలు, ఆవులను మేపుకోవడానికి ఖాళీగా ఉన్న బంజరుభూములను కేటాయిస్తాం.
• జనాభా ప్రాతిపదికన యాదవ కార్పొరేషన్ కు నిధులు కేటాయిస్తాం.
• జూపాడు గ్రామంలో శ్మశానం, యాదవుల కళ్యాణ మండపానికి స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.