PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోవెలకుంట్లలో పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాల

1 min read

– ఒక రైతుబిడ్డగా వృషభ పోటీలను ప్రోత్సహిస్తున్న  ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి 

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో.కోయిలకుంట్ల పట్టణంలోని శ్రీ పాండురంగ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయి వృషభ పోటీలను బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి  ప్రారంభించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ఒక రైతు బిడ్డ కావడంతో వృషభ పోటీలను ప్రోత్సహించాలని లక్ష్యంతో తన పెద్ద కుమారుడు కాటసాని నాగార్జున రెడ్డిచారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయల బహుమతులను చేయడం జరిగింది.ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి  మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితమైన శ్రీ పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలుఅంగరంగవైభవంగాపార్టీలకతీతంగా ప్రజలందరూ కలిసి నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. నీ బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా కాటసాని నాగార్జున రెడ్డి  చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాష్ట్రస్థాయి వృషభ పోటీలలో గెలుపొందిన వారికి లక్ష రూపాయల బహుమతులు అందజేయడం జరిగిందని చెప్పారు. గ్రామాల్లో తిరుణాల్లో, జాతరలో గ్రామ పెద్దలు కలిసి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని కోయిలకుంట్ల పట్టణంలో పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం గ్రామాల్లో అందరూ కలిసి ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పారు. గ్రామంలో అందరూ కలిసి ఉంటేనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. వృషభ పోటీలను ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే తన పెద్ద కుమారుడు కాటసాని నాగార్జున రెడ్డి  చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గెలపొందిన వృషభ జట్టులకు లక్ష రూపాయల బహుమతులు అందజేయడం జరిగిందని చెప్పారు. బనగానపల్లె నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో కోయిలకుంట్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బివి నాగార్జున రెడ్డి, రైతు సంఘం నాయకుడు కానాల రవి రెడ్డి, ఏపీ ఎన్జీవోస్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గువ్వల రామకృష్ణారెడ్డి, కోరుకొండ మండల గ్రామ సచివాలయం కన్వీనర్ లాయర్ మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author