PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగ మేళా కు విశేష స్పందన

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆధ్వర్యం లో నిరుద్యోగ యువతీ, యువకుల కొరకు రైల్వే స్టేషన్ రోడ్డు నందు ఉన్న కె.వి.ఆర్. ప్రభుత్వ మహిళా కళాశాల లో మెగా జాబ్ మేళా నిర్వహించటం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న  కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు, నగర మేయర్ బి.వై రామయ్యా గారుఈ జాబ్ మేళా నందు గ్రీన్ టెక్, హెటిరో డ్రగ్స్, జియో మార్ట్, వై ఎస్ కే ఇన్ఫోటెక్, సుకృతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బి.ఎం.ఎస్. సెక్యూరిటీస్, ముత్తూట్ ఫైనాన్స్, శ్రీ రామ్ ఫైనాన్స్, ఫార్చ్యూన్ అసోసియేట్స్, హీల్ మై ఫ్యామిలీ, టెలి పెర్ఫార్మెన్స్, నవభారత్ ఫర్టిలైజర్స్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, మరియు వివిధ కంపెనీల ప్రతినిధులు ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూ లు నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 914 మంది నిరుద్యోగ యువతీ, యువకులు పాల్గొన్నారు. వీరిలో 232 మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని జిల్లా గ్రామీణ అభివృద్ధి, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ ఎం. వెంకట సుబ్బయ్య గారు, మరియు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీ పి. సోమశివారెడ్డి గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కె.వి.ఆర్. ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డా. ఇందిరా శాంతి గారు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీ వి. శ్రీకాంత రెడ్డి గారు, మరియు సీడ్ఆప్ జిల్లా మేనేజర్ శ్రీ కిరణ్ గారు మరియు కె.వి.ఆర్. ప్రభుత్వ కళాశాల సిబ్బంది, మరియు నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author