PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ తనిఖీ

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో కోయిలకుంట్ల  ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS  గారు వార్షిక తనిఖీలలో భాగంగా కోవెలకుంట్ల సర్కిల్ పరిధిలోని కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ కు రాగానే ఆళ్లగడ్డ డి.ఎస్.పి B.వెంకట రామయ్య , సిఐ D. V.నారాయణరెడ్డి గారు స్వాగతం పలికారు అనంతరం కోవెలకుంట్ల ఎస్సై K. వెంకట్ రెడ్డి గారు మరియు వారి సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం స్టేషన్ పరిసరాలనుపరిశీలించిపరిశుభ్రంగాఉంచుకోవాలని తెలియజేశారు .మరియు కోర్టు ఆదేశాలమేరకు  కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును  మరియు లాకప్ గదులను పరిశీలించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డ్స్ లను పరిశీలించారు. ముఖ్యమైన కేసులకు సంబంధించిన తర్యాప్తు వేగవంతం చేసి చార్జి షీట్ కోర్టు నందు సమర్పించాలని ఆదేశించారు.స్టేషన్ కి వచ్చేప్రజలపట్లమర్యాదగా వ్యవహరిస్తూ, వారికి సేవలందించాలని తెలియజేశారు.స్టేషన్ లో సీజ్ చేయబడిన వాహనాలను ఏ ఏ కేసులలో పట్టుబడినాయి అని విచారించి త్వరగా డిస్పోజల్ చేయాలని ఆదేశించారు.బీట్స్ బాగా పెంచి స్టేషన్ పరిధిలో జరిగే రెగ్యులర్ క్రైమ్ పై ప్రత్యేక దృష్టి ఉంచి వాటిని పూర్తిస్థాయి నియంత్రణ చర్యలు తీసుకోవాలని, వేసవికాలం వలన చోరీలు జరగడానికి అవకాశాలు ఎక్కువ గా ఉన్నందున, వాటి నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలియజేశారు.మట్కా, జూదం, అక్రమ మద్యం తయారీపై నిఘా ఉంచాలని, అసాంఘిక  కార్యకలాపాలు సంఘ విద్రోహ చర్యలకు  పాల్పడే వారినిఉపేక్షించేదిలేదని,శాంతిభద్రతలపై రాజీలేకుండాపనిచేయాలనిఆదేశించారు.రహదారి పై రోడ్డు భద్రత చర్యలు చేపట్టుతూ, తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి ఆయా ప్రదేశాలలో, ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, బ్లాక్ స్పాట్ లను గుర్తించి రోడ్డు ప్రమాదాల పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలియజేశారు.స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారుగ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో మాట్లాడి మీకు కేటాయించిన గ్రామాలలో నాటు సారా అక్రమ ఏర్పాటు మద్యం తదితర అసాంఘిక కార్యక్రమాలు ఏదైనా ఉన్న మీకు సంబంధించిన అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు.

About Author