PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శిరోముందనంతో జర్నలిస్టుల నిరసన

1 min read

– ఆర్ఎన్ఐ ఉన్న చిన్న పత్రికలన్నిటికి అక్రిడేషన్ ఇవ్వాలని డిమాండ్.

– ప్రభుత్వ మొండి వైఖరి పై ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లాలోని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేయాలి. ఆర్ఎన్ఐ అనుమతి ఉన్న అన్ని పత్రికలకు ఆన్లైన్లో పొందుపరచాలి, ఇబ్బందులు పెట్టకుండా ఆర్ ఎన్ ఐ అనుమతి ఉన్న పత్రికలన్నిటికీ        అ క్రి డిటేషన్ కార్డులు మంజూరు చేయాలనీ కోరుతూ ఆధ్వర్యంలో కర్నూల్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు శిరోముండనం కార్యక్రమం చేపట్టారు. ఏపీజే ఫ్ ఫోటోగ్రాఫర్స్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు రామస్వామి గుండు గీయించుకుని నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ అక్రిడిటేషన్ కార్డుల ఆధారముగా జర్నలిస్టుల పిల్లలకు అన్ని ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్య అందించాలి. అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో హెల్త్ కార్డు ఆధారంగా జర్నలిస్టుల కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్య సదుపాయం కల్పించాలి. ఆర్టీసీ అన్ని బస్సులలో ప్రయాణ సౌకర్యం కల్పించా లీ. రైల్వే పాసులు మంజూరు చేయాలి. కుటుంబ సభ్యులకు( జర్నలిస్టు భార్య ఇద్దరు పిల్లలు) అవకాశం ఇవ్వాల. అర్హులైన జర్నలిస్టులందరికీ 10 సంవత్సరాలకు ఒకసారి మూడు సెంట్లు స్థలం ఇవ్వాలి. 55 సంవత్సరాలు ఉన్న జర్నలిస్టులకు పెన్షన్స్ ఇవ్వాలనీ కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, సాయికుమార్ నాయుడు, చిన్న పత్రికల అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్, ఏపీజేఎఫ్ ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షుడు రామస్వామి, కార్యదర్శి మధు, సురేష్, శ్రీను, రవి, మధుసూదన్ రెడ్డి, సురేషు శ్రీను, రమేషు, చెన్నయ్య, మల్లికార్జున్ నాయుడు తదితరులు ఉన్నారు. జర్నలిస్టులకు మద్దతుగా ఏఐఏ స్ఎఫ్, సిపిఐ నేతలు పాల్గొన్నారు.

About Author