రెండవ స్పెల్ ఉపాధ్యాయ శిక్షణ 22 నుంచి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఇచ్చే ఇండక్షన్ ట్రైనింగ్ రెండవ స్పెల్ 22.5.2023 నుండి 26.5.2023 వరకు జరుగుతుంది మొత్తం 500 మంది ఉపాధ్యాయులకు ఈ స్పెల్ లో శిక్షణ ఇస్తున్నట్లు DEO తెలిపారు. 1998 DSC.లొ ఇటీవల ఎంపికయిన ఉపాధ్యాయులు 2008 మినిమం టైం స్కేల్ లో పనిచేస్తున్న వారు. మరియు 2018 లో ఎన్నికైన ఎస్జీటీలు. అందరికీ సోమవారం నుండి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ శిక్షణ సోమవారం నుండి శుక్రవారం వరకు ఐదు రోజులపాటు జరుగుతుంది. వీరికి శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన 24 మంది రిసోర్స్ పర్సన్లు. ఉన్నారు. శిక్షణకు కోర్స్ కోఆర్డినేటర్ గా డైట్ ప్రిన్సిపాల్ గారు వ్యవహరిస్తారు. ఈ శిక్షణలో ముఖ్యంగా ఉపాధ్యాయుడు ఎప్పటికప్పుడు. నూతనత్వాన్ని నూతన టెక్నాలజీని. ఆర్జించి వాటిని ఉపయోగిస్తూ ముందుకెళ్లాలని తెలియజేస్తారు. తెలుగు ఇంగ్లీష్ గణితము. ఎన్విరాన్మెంటల్ సైన్స్ తో పాటు. ఎఫ్ ఎల్ ఎన్.( ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసి). భాషా గణితంశాలలో పునాది వేయడం. గురించిన చర్చలు ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ఇచ్చే ఈ శిక్షణ. ఉపాధ్యాయులకు ఎంతగానో ప్రయోజనం కలుగుతుంది.