కరోన థర్డ్ వేవ్ ఎలా గుర్తించాలి..?
1 min readపల్లెవెలుగు వెబ్: వివిధ రకాల వైరస్ లు, బాక్టీరీయాలు.. మహమ్మారిగా మారి భారీ స్థాయిలో వ్యాప్తి చెందుతాయి. ఇవి దశలు, దశలుగా విజృంభిస్తుంటే.. మధ్యలో విరామం ఏర్పడుతుంది. ఇలా విరామం ఏర్పడటాన్ని వేవ్స్ లేదా ఫేజ్ అని అంటారు. కరోన మొదటి దశ కొన్ని నెలలపాటు కొనసాగింది. ఆ తర్వాత కేసుల సంఖ్యలో క్రమంగా క్షీణత కనిపించింది. అలా తగ్గుతూ.. మరోసారి భారీ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గతంలో కంటే రెండో సారి కేసుల సంఖ్య, ప్రభావం, మరణాలు అధికంగా ఉన్నాయి. దీనిని రెండో దశ అంటారు. రెండో దశ ప్రస్తుతం క్షీణ దశలో ఉందని పలువురు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. రెండో దశ క్షీణించి.. ఉన్నట్టుండి కేసులు మరోసారి తారాస్థాయికి చేరితే దానిని మూడో దశగా పేర్కొనవచ్చు.
పరిష్కారం… : కరోన ఇలా దశల వారీగా విరుచుకుపడుతుంటే.. దీనికి పరిష్కారం లేదా అన్న ప్రశ్న సహజంగా వస్తుంది. వ్యాక్సిన్ వేయించుకోవడం, కోవిడ్ జాగ్రత్తలు పాటించడం ద్వార ప్రజలు థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వం థర్డ్ వేవ్ మొదలయ్యే సమయానికి ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వగలిగితే.. కరోన మూడో దశను ఎదుర్కోవచ్చని నిపుణుల అభిప్రాయం. ఇప్పటికే కేంద్రం వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచాలని ఫార్మా కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది.