కర్ణాటక మద్యం…అరికడతాం:ఎస్ఐ
1 min readఅక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్.
పల్లెవెలుగు, కౌతాళం: మండల పరిధిలో రాబడిన సమాచారం మేరకు కొసిగి సీఐ ఎరిసా వలి ఉత్తర్వుల మేరకు, కోసిగి మండలము, కడిదొడ్డి గ్రామానికి చెందిన గోతుల దొడ్డి బొజ్జయ్య s/o హనుమంతు అనే వ్యక్తి అక్రమంగా కర్ణాటక మద్యం ను కర్నాటక రాష్ట్రం మాన్వి నుండి కోసిగి మరియు కౌతాళం మండలాల గ్రామాలకు మద్యం తరలిస్తుండగా పై తెలిపిన వ్యక్తిని పట్టుకుని అతని వద్ద నుండి 90 Ml పరిమాణం గల 10 బాక్స్ లు (మొత్తం 960 ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్ విస్కీ కర్ణాటక టెట్రా ప్యాకెట్లు) మరియు మద్యం తరలించడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ లను సీజ్ చేసి, ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు కౌతళం ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు. మద్యం ను పట్టుకున్న కౌతాలం ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి మరియు సిబ్బంది హుస్సేని, వీరేష్, మధు ,రామచంద్ర, మోహన్ లను ఎమ్మిగనూరు డిఎస్పి సీతారామయ్య గారు అభినందించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే జైలు శిక్ష తప్పదు. అక్రమ కర్ణాటక మద్యం సరాఫర లో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి హెచ్చరించారు.