వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు : ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
1 min read– దిగువ అబ్బవరంలో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ నూతన భవనం ప్రారంభంలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి
పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో: వైద్యరంగంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి మండలం దిగువ అబ్బవరం లో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ నూతన భవనం ప్రారంభంలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలతో పాటు గ్రామంలోనే వైద్యసేవలు అందుబాటులో ఉండేలా ప్రతి 2500 జనాభాకు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లును ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.ఇందులో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లును నియమించా రన్నారు. ఈ క్లినిక్ లో12 రకాల వైద్యసేవలు అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. 65 రకాల మందులతో పాటు 67 రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్ మెంట్ అందుబాటులో ఉంటుందన్నారు.రాయచోటి నియోజక వర్గంలో 73 సచివాలయాల భవన నిర్మాణాలకు గాను 60 సచివాలయాల నిర్మాణాలు పూర్తి అయ్యాయని, రైతు భరోసా కేంద్రాల భవనాలు 48 పూర్తి అయ్యాయన్నారు. 60విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలకు గాను 31 విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలు ఇప్పటివరకు పూర్తి అయ్యాయని, మిగిలిన భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని శ్రీకాంత్ రెడ్డి అధికారులును ఆదేశించారు.