మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
1 min readగ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అవసరం..వాటర్ ప్లాట్ ప్రారంభించిన
ఎమ్మెల్యే కొటారు అబ్బాయ్యా చౌదరి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఎంతో అవసరమని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. బుధవారం పెదవేగి మండలంలోని జగన్నాధపురం గ్రామంలో కోర్టేవా అగ్రి సైన్స్ కంపెనీ వారు ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టేవా అగ్రి సైన్స్ మొక్కజొన్న కంపెనీ మండల పరిధిలోని గ్రామాలలో రైతులకు మొక్కజొన్న సీడ్ అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని, దీంతోపాటు అనేక సేవా కార్యక్రమంలో పాల్గొని గ్రామాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించడం ఎంతో సంతోషదాయకమని ఆయన అన్నారు. వాటర్ ప్లాంట్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు వెచ్చించి తాగు నీటి కొరత లేకుండా చేయడం ఎంతో గొప్ప విషయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాతా రమ్య కుమార్, ఎంపీటీసీ రాచప్రోలు చంద్రరావు, గ్రామ సర్పంచి మాత్రపు కోటేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ మేకా లక్ష్మణరావు, కంపెనీ ప్రతినిధులు అనంత రామ కోటేశ్వరరావు, ఉండవల్లి వెంకట్రావు, జి ఎస్ ఎస్ వి పెదబాబు (జానంపేట బాబు) సర్పంచ్ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.