జెమ్ కేర్ కామినేని ఆస్పత్రిలో.. అరుదైన వ్యాధికి శస్త్ర చికిత్స
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరం కొత్త బస్టాండు కు సమీపంలోని జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బాలమురళి కృష్ణ(జనరల్ & లాప్రో స్కోపిక్ సర్జన్ ), డాక్టర్ ఆదిత్య( అనస్థీషియా), డాక్టర్ రాఘవేంద్ర( కార్డియాలజీస్ట్) లు అరుదైన వ్యాధికి శస్త్ర చికిత్స చేశారు. పాన్యం కు చెందిన మద్దయ్య (36) తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరం, కామెర్లతో బాధపడుతూ హాస్పిటల్ కు రాగా వైద్యులు పరీక్షించి అక్యూట్ మెసెంటెరిక్ ఇస్కీమియా ( తీవ్రమైన కడుపు నొప్పి) అనే వ్యాధిగా గుర్తించారు. వైద్యుల పరీక్షల అనంతరం అతనికి గుండెలోని రక్తనాళాలలో ఏర్పడిన అవరోధం, పేగులకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలలో ఏర్పడిన అవరోధం వలన 1.5 మీ లు గల చిన్న ప్రేగు నెక్రోసిస్ కు గురైందని గుర్తించారు. ప్రాణాపాయ స్థితిలో గల అతన్ని ఎంతో శ్రమించి నెక్రోసిస్ కు గురైన ప్రేగు తొలగించామని, అతను పూర్తిగా కోలుకున్నారని వైద్యులు తెలిపారు. చిన్న ప్రేగులకు రక్త ప్రసరణ ఆకస్మికంగా ఆగిపోవటం ను అక్యూట్ మెసెంటెరిక్ ఇస్కీమియా అంటారన్నారు. ఇది రక్తం గడ్డకట్టడం వల్ల వస్తుంది. శస్త్రచికిత్స తక్షణం అవసరం అన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎంతో క్లిష్టమైన శస్త్ర చికత్స ను విజయవంతంగా చేయటం ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి అరుదైన వ్యాధులకు చికిత్స లు చేయుటకు జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ వైద్యులు సిద్దమన్నారు. హాస్పిటల్ జనరల్ మేనేజర్ నదీమ్ మాట్లాడుతూ జెమ్ కేర్ కామినేని ఆస్పత్రి వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు.