గ్రామీణ ప్రాంతాల సమస్యలను సత్వరమే పరిష్కరించండి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: మండల వ్యాప్తంగా గ్రామీణ గ్రామాల్లో నెలకున్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం లో ప్రభుత్వము , అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని, వాటి పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు వీరశేఖర్ మండల నాయకులు సూరి సంజన, అశోక్, శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు మండల వ్యాప్తంగా కోటకొండ,కప్పట్రాళ్ల తెర్నేకల్లు ,కుంకునూరు పొట్లపాడు గ్రామ సచివాలయల ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి సచివాలయ కార్యదర్శికి వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని అదేవిధంగా మండలంలో సాగునీటికి ప్రధానమైన హంద్రీనీవా పంటకాలువ నిర్మాణము, కరిముల, తెర్నేకల్ మధ్య హంద్రీ నీవా కాలువ పెండింగ్ పనులు మరియు హంద్రీనీవా కాలువ మొదటి దశ పనులు కూడా పూర్తి కాకపోవడం వలన రైతాంగానికి చాలా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. హంద్రీనీవా కాల్వపనులు పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని, గుండ్లకొండ దగ్గర హంద్రీనీవాకు స్లుయిజ్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు .అదేవిధంగా ఈ సంవత్సరం పంటల బీమా పంటల బీమా లో పత్తి పంటకు భీమా రాకపోవడం వలన మండల వ్యాప్తంగా రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, పత్తి పంట కు బీమా వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల లింకు రోడ్ల నిర్మాణం అధ్వానంగా ఉందని గ్రామీణ ప్రాంతాల లింక్ రోడ్ లు పునర్ నిర్మించాలని డిమాండ్ చేశారు. కోటకొండలో పిహేచ్ సీ ఏర్పాటు, పొట్లపాడు దగ్గర హంద్రిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.దేవనకొండ టర్నింగ్ దగ్గర నుండి కుంకునూరు వరకు పాత రోడ్డు పునర్ నిర్మించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యూసుఫ్ భాష,బజారి, గాజుల శ్రీనివాసులు, ఓంకార్, అనిల్, సుభాన్, మహబూబ్ బాషా, నాగరాజు, ఈరన్న, చంద్రశేఖర్ మహేంద్రా, శీను, గిడ్డయ్య, లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.