ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు..సుశ్రుతుడు: డా. చంద్రశేఖర్
1 min readఅడిషనల్ డీఎంఈ& కార్డియాలజీ విభాగపు అధిపతి డా.చంద్రశేఖర్
- కర్నూలు వైద్య కళాశాల వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే వేడుకలు
పల్లెవెలుగు: మనిషి శరీరంలో పునరుద్ధరణ, పునర్నిర్మాణం లేదా మార్పులతో కూడిన శస్ర్తచికిత్సను ప్లాస్టిక్ సర్జరీ అంటారు. అటువంటి ప్లాస్టిక్ సర్జరీకి పితామహుడు డా. సుశ్రతుడని.. ప్రస్తుత వైద్యులు సుశ్రుతుడును ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అడిషనల్ డీఎంఈ& కార్డియాలజీ విభాగపు అధిపతి డా.చంద్రశేఖర్. శనివారం కర్నూలు మెడికల్ కళాశాల ఆవరణలో వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్ కళాశాల ఆవరణలోని సుశ్రుత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా వైద్యరంగంలో మార్పులు రావడం సహజమన్నారు. ప్రమాదవశాత్తు గాయపడిన.. చర్మం కాలిపోయిన చోట.. కొత్త చర్మాన్ని శస్ర్తచికిత్స ద్వారా వేస్తారని, అప్పుడు మునుపటి చర్మం మాదిరిగానే మెరుగ్గా ఉంటుందన్నారు. రోగుల ద్వారా తీవ్రమైన అమానవీయ బాధలను నివారించడానికి శస్త్రచికిత్సల కోసం అనస్థీషియా కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి కూడా డా. సుశ్రుత అని పేర్కొన్నారు. అదేవిధంగా అంటువ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులను విశ్లేషించి, హెర్బల్ ట్రీట్మెంట్ను కనిపెట్టారని, అంతేకాక న్యూరో సర్జరీ నిర్వహించిన మొదటి వ్యక్తి సుశ్రుత అని తెలియజేశారు. అనంతరం విగ్రహ దాత ఎం.ఏలియా మాట్లాడుతూ వైద్య రంగం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది ఉన్నారు.