PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సఫాయి కర్మచారులకు వేతనాలు చెల్లించాలి

1 min read

– అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పి కె. రఘువీర్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  ప్రభుత్వ కార్యా ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్న సఫాయి కర్మచారులకు నెలనెలా వేతనాలు చెల్లించాలని జిల్లా ఎస్పి కె. రఘువీర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సఫాయి కర్మచారులు, మాన్యువల్ స్కావెంజర్ల కుటుంబాల పునరావాసంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, అడిషనల్ ఎస్పీ జి.వెంకట రాముడు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్, నంద్యాల సబ్ డివిజనల్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పి కె. రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపాలిటీలు, ఆసుపత్రులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న సఫాయి కర్మచారులు మరియు  మాన్యువల్ స్కావెంజర్స్ కు సక్రమంగా వేతనాలు చెల్లించాలని సూచించారు. చెల్లించే వేతనాలలో మినహాయించే పిఎఫ్ మొత్తాన్ని కూడా సంబంధిత  సఫాయి కర్మచారులకు తెలపాలన్నారు. అలాగేఈఎస్ఐ కార్డులను కూడా మంజూరు చేసి వారికి అనారోగ్య పరిస్థితుల్లో ఈఎస్ఐ కార్డులు ఉపయోగపడేటట్లు చూడాలన్నారు.కమిటీ సభ్యులు మహేశ్వరమ్మ మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్లో దాదాపు 20 సంవత్సరముల నుంచి 15 మంది కాంట్రాక్టు పద్ధతిపై సఫాయి కార్మికులు పనిచేస్తున్నారని…వీరికి పిఎఫ్ కింద 2000 రూపాయలు కట్ చేస్తున్నారని మిగిలిన 8000 రూపాయలు కూడా  సకాలంలో జీతాలు ఇవ్వక ఇబ్బందుల పాలు చేస్తున్నారని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. మరో కమిటీ సభ్యురాలు చిన్నమ్మ మాట్లాడుతూ మహానంది దేవస్థానంలో ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేయించుకుంటూ వేతనం కేవలం తొమ్మిది వేలు మాత్రమే ఇస్తున్నారని,  మొత్తం 70 మంది సఫాయి కార్మికులు ఉండగా16 మంది దేవస్థానంలో పని చేస్తున్నారని తెలిపారు. కమిటీ దృష్టికి తీసుకువచ్చిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్యను ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో  సాంఘిక సంక్షేమ శాఖ డిడి చింతామణి, సఫాయి కర్మ చారుల కమిటీ సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author