ప్రతి ఒక్కరు సేవా దృక్పథంతో మెలగాలి
1 min read-గ్లోబల్ ప్రింటర్స్ ప్రారంభోత్సవంలో తాటిపాడు మహబూబ్ సాహెబ్
కర్నూలు: జీవితంలో ప్రతి ఒక్కరు సేవా దృక్పథం తో నడుచు కోవాలని కర్నూలు జిల్లా ప్రైవేటు గోడోన్స్ జిల్లా అద్యక్షులు,రబ్బానీ గ్రూప్ చైర్మన్ తాటిపాడు మహబూబ్ సాహెబ్ అన్నారు.శనివారం కర్నూలు నగరం లోని కల్లూరు ఇండస్ట్రీయల్ ఎస్టేట్ లో అంకురం తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో గ్లోబల్ ప్రింటర్స్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందికొట్కూరు కు చెందిన తాటిపాడు మాబు సాహెబ్, ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడెమీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సయ్యద్ నూరుల్లా ఖాద్రి, ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ మాజీ సభ్యులు మెహమూద్ పాషాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు లో ప్రింటింగ్ యూనిట్ ప్రారంభించడం చాలా సంతోషించతగ్గ విషయని ,స్ధానిక పత్రికలు సుదూర ప్రాంతాలకు వెల్లకుండా యూనిట్ అవకాశం కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని స్ధానిక పత్రికల యాజమాన్యాలు అందరూ ఉపయోగించుకోవాలన్నారు. పాత్రికేయులు అందరు ఒకరి నొకరు పరస్పర సహకారం అందించుకుని ఆర్ధికంగా ఎదగాలని కోరారు. అనంతరం యూనిట్ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా లోని వివిధ జర్నలిస్ట్ సంఘాల అధ్యక్షులు పలు స్ధానిక పత్రికల యాజమాన్యాలు పాల్గొన్నారు.