ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో ఓడి లెక్చరర్ గ్యాలరీ మీటింగ్ హాల్లో మిషన్ ఇంద్రధనస్సు మీద యూపీఎస్సీ వైద్యాధికారులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికా రులకు ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించబడినది ఈ ప్రోగ్రాం లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రామ గిడ్డయ్య మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తల ద్వారా గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించాలని 0-5 సంవత్సరం వయసు గల పిల్లలు వారీగ మిస్సయిన వారికి లేదా డ్రాప్స్ అవుట్స్ అయినా పిల్లలను గుర్తించి ఈనెల 25వ తారీకు లోపల టీడీ వ్యాక్సినేషన్ గర్భిణీ స్త్రీల వివరాలు సర్వే ద్వారా పూర్తిచేసి ఆరోగ్య కార్యకర్తలు ఆశాల ద్వారా వైద్యాధికారులు సర్వేను పూర్తి చేసి డి ఐ ఓ గారు మెయిల్ లకు వివరాలను పంపవలసినదిగా తెలిపారు ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ ప్రోగ్రాం నందు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు చిన్నపిల్లలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారికి రక్తహీనత పరీక్షలను నిర్వహించి తగు చికిత్సను అందజేయాలని తెలిపారు ఎన్ సి డి సర్వే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాలపై తదితర అంశాలపై చర్చించారు ఆశ ఏఎన్ఎం సిహెచ్ వాళ్ళ పై ప్రతిరోజు వారిపై పర్యవేక్షణ చేయాలని వైద్యాధికారులకు సూచనలు ఇచ్చారు టీకాలు వేయని మరియు పాక్షికంగా టీకాలు వేయించుకున్న పిల్లలందరినీ గుర్తించి అన్ని టీకాలు అర్హులైన పిల్లలందరికీ అంటే బెనిఫిషరీస్ ని అర్హులైన పిల్లలందరికీ వేయుటకు ఈ సర్వే జరుగుచున్నది ఈ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ భవాని గారు డి ఐ ఓ ప్రవీణ్ కుమార్ గారు డిపిఎమ్ఓ డాక్టర్ ఉమా ఆర్ బి ఎస్ కే కోఆర్డినేటర్ హేమలత గారు ఎన్హెచ్ఎం డిపిఓ విజయరాజు తదితరులు పాల్గొన్నారు.