జిల్లా స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీలు..
1 min read– రవీంద్ర భారతి విద్యార్థుల ఎంపిక
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లా స్థాయి రోప్ స్కిప్పింగ్ ఎంపిక పోటీలు బుధవారం నాడు ఎస్పీజీ గ్రౌండ్ లో నిర్వహించారు. అందులో పాల్గొన్న గడివేముల లోని శ్రీ రవీంద్ర భారతి హై స్కూల్ విద్యార్థినిలు ప్రతిభ కనబరిచి 28/29 కర్నూల్ లో జరగబోయే రాష్ట్ర సాయి పోటీలకు అర్హత సాధించారు జిల్లా లోని ప్రైవేట్ మరియు కస్తూర్బా మరియు జిల్లా పరిషత్ పాఠశాలల బాల బాలికలు దాదాపు 200మంది పాల్గొన్నారు.U12,14,17,19 కేటగిరీ విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను కనబరచి జిల్లా జట్టుకు ఎంపిక అయినట్టు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా పీ ఈ టీ. ఎస్ ఏ పి ఈ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ బత్తుల రవికుమార్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోప్ స్కిప్పింగ్ క్రీడ విద్యార్థుల మానసిక శారీరక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపుతోంది అని , బాడీలోని అన్ని అవయవాలు ఇన్వాల్వ్ అవుతాయని మంచి స్టామినా ఎండురెన్స్ ఫిట్నెస్ డెవలప్మెంట్ e అవుతాయని, పోటీలకు ఎంపికైన విద్యార్థులందరికీ శుభాకాక్షలు తెలియజేశారు.ఈ నెల 29,30వ తేదీన గర్గేయపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 వ రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని విజయవంతం చేయాలని, మరియు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో పిడిలు భాష సులోచన, సిద్దార్థ రాజు హరి, బీమా నాయుడు అసోసియేషన్ ప్రతినిదులు ప్రభాకర్, మల్లికార్జున పాల్గొన్నారు.