11 మంది తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడి..
1 min read– తల సేమియా చిన్నారులను పరామర్శించిన జిల్లా లైన్స్ క్లబ్ సభ్యులు..
– 30 మంది కి ఉచిత భోజన సదుపాయం..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తల సేమియా భవనంలో 11 మంది తల సేమియా చిన్నారులకు రక్త మార్పిడిని నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బీవి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా లైన్స్ క్లబ్ గవర్నర్ గట్టు మాణిక్యాలరావు మరియు లైన్స్ క్లబ్ సభ్యులు పద్మజ, డి సి ఎస్ మల్లేశ్వరరావు, సిహెచ్ అవినాష్ లు తల సేమియా చిన్నారులను పరామర్శించి వారికి పండ్లను పంపిణీ చేశారు. అనంతరం తల సేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు 30 మందికి మధ్యాహ్నం ఉచిత భోజనం ఏర్పాటు చేసిన దాత మానవత విద్యా నిధి మరియు కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావుకు కృష్ణారెడ్డి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి బి.బెన్నీ, డాక్టర్ ఆర్ ఎస్ ఆర్ కే వరప్రసాదరావు, మానవత సభ్యులు కడియాల కృష్ణారావు, రత్నకరరావు, లైన్స్ క్లబ్ సభ్యులు పద్మజ, డి సి ఎస్ మల్లేశ్వరరావు, సిహెచ్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు.