తక్కువ పెట్టుబడి తో నాణ్యమైన దిగుబడి. పొలంబడి..
1 min read– మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలోని దుర్వేసి గ్రామంలో మంగళవారం నాడు వరి పంట పైన రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్యంగా పంటకు ముందు అవగాహన కార్యక్రమాలైనా గ్రామసభ, పంట యాజమాన్యంలో లోపాలను గుర్తించుట,30 మంది రైతులను 25 ఎకరాలలో 5 గ్రూపులుగా ఎంపిక చేసి వారి యొక్క ఖర్చు లాభాల నిష్పత్తిని కనుగొనుట ఈ ఖరీఫ్ సీజన్ కి గడివేముల మండలంలో వండుట్ల గ్రామంలో పత్తి పంట పైన ఎంపీఈవో మాధవి ఈ కార్యక్రమాన్ని 14 వారాలపాటు నిర్వహించడం జరుగుతుందని. విత్తనం నుండి విత్తనం వచ్చేంతవరకు పొలంలో చేసేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు మండల వ్యవసాయ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మండ్ల మమత, గ్రామ వ్యవసాయ సలహా మండలి సభ్యులు మరియు రైతు సోదరులు పాల్గొన్నారు.