PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెదవేగి నవోదయ స్కూల్లో జాతీయ క్రీడాకారులకు అస్వస్థత..

1 min read

– స్వయంగా పరామర్శించిన జిల్లా అధికారులు..

– ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ , ఎస్పీ మేరీ ప్రశాంతి

– మెరుగైన వైద్యం కోసం సత్వర ఏర్పాట్లు..

– విద్యార్థులకు నిలకడగా ఆరోగ్యం..

– పరీక్షలకు ఫుడ్ శాంపిల్స్ అనంతరం తగు చర్యలు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధులను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ , దెందులూరు శాసన సభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. శనివారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. పెదవేగి మండలం నవోదయ స్కూల్లో జాతీయస్ధాయి క్రీడా పోటీలకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన పలువురు విద్యార్ధులు ఫుడ్ పాయిజన్ కు గురైనారు.  స్ధానికంగా వైద్యాన్ని అందించే క్రమంలో విద్యార్ధులకు జ్వరం ఉండటంతో వారికి మరింత మెరుగైన వైద్యకోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  శుక్రవారం రాత్రి దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఏలూరు ఆర్డిఓ కె. పెంచల కిషోర్, నూజివీడు డియస్పీ అశోక్ గౌడ్, డియంహెచ్ఓ డా. నాగేశ్వరరావు, స్వయంగా జ్వరానికి గురైన విద్యార్ధులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.  ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న విద్యార్ధులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్నవెంకటేష్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి విద్యార్ధులకు ధైర్యం చెప్పారు.  ఈ సందర్బంగా మెడికల్ సూపరింటెండెంట్ డా. యం. శశిధర్, ఛీఫ్ ఫిజీషియన్ డా. పోతునూరి శ్రీనివాసరావు, ఆర్ ఎంఓ డా. పిఆర్ఎస్ శ్రీనివాసరావులతో కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్ధులకు అందించిన వైద్య సేవలను వాకబు చేశారు.  అనంతరం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ పెదవేగిలోని జవహర్ నవోదయ స్కూల్లో క్రీడా పోటీల కోసం తమిళనాడు, హర్యానా, కేరళ, కర్నాటక తదితర  ఐదు రాష్ట్రాల నుండి  ఈ నెల 3వ తేదీన రావడం జరిగిందన్నారు.  ఈ నెల 4వ తేదీన స్పైసీ ఆహారం తీసుకోవడం వల్ల శుక్రవారం సాయంత్రం వాంతులు, కడుపునొప్పితో కొందరు విద్యార్ధులకు వచ్చాయన్నారు.  వెంటనే స్ధానికంగా వైద్యం అందించడమేకాకుండా ప్రత్యేకంగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి శుక్రవారం రాత్రి 3 గంటల వరకు అక్కడే ఉండి స్వయంగా వైద్య సేవలను పర్యవేక్షించారన్నారు.  అయితే కొంతమంది జ్వరం కూడా రావడంతో వారికి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో 74 మంది విద్యార్ధులు చికిత్స పొందుతున్నారన్నారు. ముగ్గురికి మాత్రం డయేరియా అవుతుందన్నారు. ప్రస్తుతం విద్యార్ధుల ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.    శనివారం సాయంత్రం వారిని డిశ్చార్జి చేయడం జరుగుతుందన్నారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతోపాటు విద్యార్ధులను వారి తల్లిదండ్రులతో మాట్లాడించడం జరిగిందన్నారు.  ఫుడ్ శాంపిల్స్ పరీక్షలకు పంపడం జరిగిందన్నారు. సంబంధిత రిపోర్టు వచ్చిన పిమ్మట వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దెందులూరు శాసన సభ్యులు కొఠారు అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల నుండి రీజనల్ స్పోర్ట్స్ మీట్ కు 195 మంది విద్యార్ధులు రావడం జరిగిందన్నారు.  ఈపోటీలు ఈనెల 3 నుండి 5వ తేదీ వరకు జరగుతాయన్నారు.  74 మంది పిల్లలు జ్వరం రావడం జరిగిందని అయితే ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.  వారి ఆరోగ్యం పట్ల ప్రత్యక శ్రద్ధ తీసుకున్నామని ఎవరూ ఆంధోళన చెందవలసిన అవసరం లేదన్నారు.  ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పరిచేస్తుందన్నారు.  విద్యార్ధులతోపాటు 34 మంది ఎస్కార్ట్స్ కూడా వచ్చారని వారితోకూడా మాట్లాడటం జరిగిందన్నారు.  పిల్లల తల్లిదండ్రులతోకూడా మాట్లాడటం జరిగిందన్నారు.  పిల్లలందరూ కూడా పూర్తిగా ఆరోగ్యం కోలుకొనేవరకు అన్నిజాగ్రత్తలు తీసుకుంటామన్నారు.  అంతా కంట్రోలో లేనే ఉందన్నారు.  ఆసుపత్రిలో 74 మంది విద్యార్ధులన్నారని స్కూల్లో సైతం మెడికల్ క్యాంపు కొనసాగుతున్నదన్నారు.  ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సమాచారం ఇచ్చామని ఈ మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో ఏలూరు తహశీల్దార్ బి. సోమశేఖర్,  తదితరులు ఉన్నారు.

About Author