PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యాక్సినేషన్ ఒకటే.. మార్గం

1 min read

– ఫ్రంట్‌ లైన్ వారియర్స్‌, హెల్త్ కేర్ వర్కర్లకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలి
– వీసీలో అధికారులను ఆదేశించిన కలెక్టర్​ జి.వీరపాండియన్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కోవిడ్ ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ఒకటే మార్గమని, వ్యాక్సినేషన్ పక్రియ పై ప్రత్యేక దృష్టి సారించి … ఫ్రంట్​లైన్ వారియర్స్‌, హెల్త్ కేర్ వర్కర్ కు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలని కలెక్టర్​ జి. వీరపాండియన్​ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కోవిడ్-19, ఉపాధి హామీ పథకం పనులు, ఇంటి పట్టాలు, హౌసింగ్, స్పందన గ్రీవెన్స్, వైయస్సార్ బీమా, జగనన్న తోడు, వైయస్సార్ చేయూత, పీఎం స్వనిధి, వాహనమిత్ర అంశాల పై జిల్లా స్థాయి, డివిజనల్ మరియు మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనగా స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హల్లో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్, జేసీ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీ, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డి ఆర్ ఓ పుల్లయ్య, జెడ్పి సీఈఓ వెంకటసుబ్బయ్య, డిఎమ్ హెచ్ ఓ రామగిడ్డయ్య, డిఆర్డీఏ పిడి వెంకటేశులు, పంచాయతీరాజ్ ఎస్ ఈ సుబ్రహ్మణ్యం, డ్వామా పిడి అమర్నాథరెడ్డి, మెప్మా ఇంచార్జి పిడి శిరీష, డిపిఓ ప్రభాకర్ రావ్, డిటిసి చందర్, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు, ఆర్డిఓ లు, డివిజనల్ మరియు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ అధికారులందరూ సమన్వయంతో సమర్థవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. వలంటీర్ల ద్వారా గ్రామంలో 45 ఏళ్లు పైబడి వ్యాక్సిన్ వేయించుకోకుండా మిగిలి ఉన్న వారందరికీ వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జేసీలను ఆదేశించారు. అందులో భాగంగా జిల్లా, డివిజన్ మరియు మండల స్థాయి అధికారుల వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు పలు అంశాలపై సమీక్షించారు.

About Author