ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు కర్నూల్ కరెక్టరేట్ దగ్గర గాంధీ విగ్రహానికి పూలమాలవేసి అక్కడి నుండి చేనేత కుల సంఘాల నాయకులు నక్కల మిట్ట శ్రీనివాసులు, చింత శ్రీనివాస్ ఆధ్వర్యంలో, చేనేత కుల సంఘాలు పాల్గొని రాలీగా చేనేత భవన్ వరకు వెళ్లడం జరిగింది. చేనేత భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చేనేత కుల పెద్దలు మాట్లాడుతూ అగ్గిపెట్టిలో పట్టే చీర నేసే నైపుణ్యమున్న చేనేత కార్మికులు నేడు, గిట్టుబాటుధరలు లేక ఆదుకునే నాధుడు లేక అన్నమో రామచంద్ర అంటూ పొట్టకూటికోసం ఏదో ఒక పనికి కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి స్థానం వ్యవసాయం అయితే రెండో స్థానం మా చేనేతలదే అని ఈ సందర్భంగా గుర్తు చేశారు, ఈరోజు కుంటుపడుతున్న కుటీర పరిశ్రమలలో భాగమైన చేనేత పై జిఎస్టి రద్దు చేయాలనీ నాయకులు డిమాండ్ చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహాత్మా గాంధీ లాంటి నేతలు ఆనాడు చేనేతలకు బాసటగా నిలిచి చేనేత వృత్తులను ప్రోత్సహించారని మహాత్మా గాంధీ తనే రాట్నం ఓడికి ఆదర్శ నాయకుడిగా చేనేతల పక్షపాతిగా నిలబడ్డారని వారు కొనియాడారు. నేటితరం నాయకులలో చేనేతల పక్షపాతగా వ్యవహరించే నాయకులే లేకపోవడం సిగ్గుచేటని ఈ సందర్భంగా పేర్కొన్నారుచేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. రైతు బజార్ల మాదిరిగా చేనేత బజార్లు ఏర్పాటు చేయాలి. వాటి నిర్వహణ బాధ్యతలు కూడా చేనేతలకు ఇవ్వాలి. చేనేత వృత్తిలో ఉంటూ ఆర్థికంగా వెనుకబడిన ప్రతి కుటుంబానికి కనీసం నెలకు 10,000 ఉండేటట్లు ప్రభుత్వాలు చొరవ చూపాలి. స్కూలు యూనిఫామ్ లు తదితర ప్రభుత్వ అవసరాలు చేనేతలకి ఆర్డర్ ఇవ్వాలి. చేనేత కుటుంబాలకు ఆరోగ్య భద్రత,ఇన్సూరెన్స్ చర్యలు చేపట్టాలి. ప్రభుత్వమే చేనేతలని ఆదుకోవాలి. ఈ కార్యక్రమంలో చేనేత కుల సంఘాల నాయకులు పద్మశాలిరాయలసీమ శకుంతల, తొగట వెంకటేశ్వర్లు, ఛాయా ఓంకారమయ్యా, గడిగే ప్రసాద్,రాధాకృష్ణ, నాగరాజు,దేవాంగ ప్రభాకర్, H. రవి శంకర్, S.L.R. రావు, అడ్వకేట్ కృష్ణ పాల్గొన్నారు.