PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్)రాష్ట్ర కార్య నిర్వాహక వర్గ సమావేశం  రాష్ట్ర అధ్యక్షులు సి హెచ్ శ్రావణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో 26 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగారాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్ బాలాజీ కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు. వాటిలో భాగంగా ఉపాధ్యాయులను భయాందోళనలు మరియు ఒత్తిడికి గురిచేసే విధంగా పాఠశాలల  సందర్శనల పేరుతో అధికారులు చేస్తున్న అనవసరపు హడావిడి ని ఖండిస్తూ రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ కి మెమోరాండం ఇవ్వాలని తీర్మానించారు.జనవరి నెలలో 2500/- రూపాయల ప్రమోషన్ పేరుతో నాలుగునెలల వెట్టిచాకిరీకి వెంటనే బకాయిలు చెల్లించాలని తీర్మానించారు.CPS విధానం రద్దు చేస్తూ GPS విధానం కాకుండా OPS ను పునరిద్ధరించాలని అన్నారు ప్రాధమిక పాఠశాల  ఉపాధ్యాయులకు వర్క్ షీట్స్ ఒక్కో పాఠానికి 25 పైగా వర్క్ షీట్స్ ఉన్నాయని….అంత సిలబస్ బోధన చాలా ఇబ్బందిగా ఉందని…పిల్లవాడి స్థాయి దాటిఉందని..కావున సిలబస్ తగ్గించాలని తీర్మానించారు.ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు వారానికి 32 పీరియడ్లు దాటి ఉండకూడదని  , ఆ విధమైన చర్యలు SCERT తీసుకోవాలని తీర్మానించారు.ఉపాధ్యాయుల సంక్షేమం తోపాటు వారివారి కుటుంబాల సంక్షేమం  కోసం నిరంతరం సంఘం పనిచెయ్యాలని తీర్మానించారు.క్యాడర్ స్ట్రెంగ్త్ క్లియర్ అవ్వకపోవడం వల్ల PGT లకు మరియు ప్రమోషన్/బదిలీ పొందిన ఉపాధ్యాయులకు జీతాలు రాకపోవడం చాలా దారుణం అని…వెంటనే జీతాలు చెల్లించేలా DTA తో విద్యాశాఖ అధికారులు చర్చించాలని తీర్మానించారు.ప్రాధమికోన్నత పాఠశాలకు రోలు తక్కువగా ఉన్నదని SA పోస్ట్ లు తీసివేయడం….అలాగే ఉన్నత పాఠశాలలకు GHM/PD పోస్ట్ లు తీసివేయడం సరికాదని,వెంటనే ప్రతి ప్రాధమికోన్నత పాఠశాలకు SA లను…ప్రతి ఉన్నత పాఠశాలకు GHM/PD పోస్ట్ లు తిరిగి మంజూరు చేయాలని తీర్మానించారు.ప్రతి ఉన్నత పాఠశాలకు ఖచ్చితంగా కంప్యూటర్ అసిస్టెంట్ ను నియమించాలని, GHM ల ఇబ్బందులు తొలగించాలని తీర్మానించారు.సరెండర్ లీవ్ లు మరియు ఇతర ఆర్ధిక సంబంధిత బకాయిలు వెంటనే చెల్లించాలని తీర్మానించారు.ఉపాధ్యాయ డైరీ ప్రతి రోజూ రాస్తున్నారు కావున..లెసన్ ప్లాన్స్ సిలబస్ మారేవరకూ ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించాలని, ప్రతి సంవత్సరం వ్రాయాల్సిన అవసరం లేకుండా చూడాలని  తీర్మానించారు. అదేవిధంగా లెసన్ ప్లాన్స్  ప్రింటెడ్ కూడా అనుమతించాలని తీర్మానించారు. ఉన్నత పాఠశాలల్లో అప్పుడే అదనపు తరగతులు నిర్వహించాలని పదవ తరగతి ఉపాధ్యాయులను ఇబ్బందికి గురి చేస్తున్నారని..జనవరి నెల వరకు అదనపు తరగతులు నిర్వహించకుండా అధికారులు ఆదేశాలు ఇవ్వాలని తీర్మానించారు.రాబోయే PRC లో స్టెప్ అప్…ప్రీ పోన్ మెంట్ అనుమతించాలని తీర్మానించారు.ఒకే క్యాడర్ లో 30 సంవత్సరాల స్కేలు మంజూరు చేయడానికి ప్రస్తుత PRC అనుమతిస్తోంది కావున, 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులకు 6 సంవత్సరాల స్కేలు మంజూరు చేయాలని తీర్మానించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు  యస్.రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి  యం. సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author