PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌దో త‌ర‌గ‌తి పాసైన వారికి స్కాల‌ర్ షిప్.. !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఎస్సీ విద్యార్థుల‌కు కేంద్ర ప్రభుత్వం స్కాల‌ర్ షిప్ లు అందిస్తోంది. వీరి చ‌దువుకు అండ‌గా నిలిచేందుకు 63 ల‌క్షల రూపాయ‌ల స్కాల‌ర్ షిప్ అందిస్తోంది. అర్హత గ‌ల అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్ షిప్ పేరిట ఈ స‌హాయాన్ని అందిస్తోంది. సామాజిక న్యాయం, సాధికారిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2020-21 నుంచి 2025-26 వ‌ర‌కు 63 ల‌క్షల మందికి స్కాల‌ర్ షిప్ లు అందిస్తున్నారు.
ఎవ‌రు అర్హులు:
ప‌దో త‌ర‌గ‌తి పూర్తీ చేసి.. ఇంట‌ర్మీడియ‌ట్, ఆ పై త‌ర‌గ‌తులు చ‌దువుతున్న ఎస్సీ అభ్యర్థులు అర్హులు. వీరి కుటుంబ వార్షిక ఆదాయం 2.5 ల‌క్షల లోపు ఉండాలి. భార‌త దేశంలో నివ‌సించే వారికే అర్హత ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హలు.
ఎంపిక‌:
ద‌ర‌ఖాస్తులు ప‌రిశీల‌న‌, ఎంపిక రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉంటుంది. ఇప్పటికే స్కాల‌ర్ షిప్ లు పొందుతున్న వారితో పాటు, కొత్త వారికి కూడ అవ‌కాశం ఉంటుంది.
ఎంత ఇస్తారు:
వివిధ స్థాయిల‌ను బ‌ట్టి రూ. 2,500 నుంచి రూ.13,500 వ‌ర‌కు ఇస్తారు.
ఎంత మందికి ఇస్తారు:
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కాల‌ర్ షిప్ ల ద్వార దాదాపు 63ల‌క్షల మందికి ల‌బ్ధి చేకూర‌నుంది.
ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి:
ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
చివ‌రి తేది: 30-6-2021

అధికారిక వెబ్ సైట్: http://socialjustice.nic.in/

About Author